newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

26-05-202026-05-2020 09:28:22 IST
2020-05-26T03:58:22.505Z26-05-2020 2020-05-26T03:55:35.848Z - - 11-04-2021

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ పిల్లలకు కూడా లేని ధైర్యాన్ని కూడగట్టుకునేలా చేస్తోంది. తాజాగా ఓ కుర్రాడు ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. అది కూడా ఒంటరిగా, పాలబుగ్గల పసితనం ఇంకా వీడని ఐదేళ్ల బుడ్డోడు బెంగళూరు విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒంటరిగా విమానం దిగుతుంటే చుట్టుపక్కల వాళ్ల నోళ్లు వెళ్లిబెట్టి చూశారు. స్పెషల్ కేటగిరీ కింద బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా జర్నీ చేశాడు. 

బెంగళూరుకు చెందిన విహాన్ శర్మ అనే పిల్లాడు లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. లాక్‌డౌన్ వల్ల తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. తల్లిదండ్రులపై బెంగతో రోజులు వెళ్లదీశాడు.ఎప్పుడు అమ్మానాన్నల్ని చూద్దామా అని తపించాడు. బంధువులు కూడా విహాన్ కి నచ్చచెప్పారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా  దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో విహాన్ ప్రయాణానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. బుడ్డోడికి మాస్కు, ప్లాస్టిక్ షీల్డ్ గ్లవుజులు తొడిగి భద్రంగా స్పెషల్ కేటగిరీ కింది విమానం ఎక్కించారు.

సిబ్బంది వాడికి సీట్ బెల్ట్ తగిలించి మరింత జాగ్రత్తగా చూసుకున్నారు. విమానం బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. వాడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తల్లి... బిడ్డ కనిపించగానే ఒడిలోకి తీసుకుంది. విహాన్ మీడియాకు స్పెషల్ కేటగిరీ బోర్డు చూపెడుతూ మరింత సందడి చేశాడు. ఢిల్లీనుంచి బెంగళూరుకు ఎలాంటి బెరుకు లేకుండా ప్రయాణించిన విహాన్, అతడికి అనుక్షణం చేదోడు వాదోడుగా నిలిచిన విమాన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle