ఈ అపూర్వ విజయం ప్రజలదే: మోడీ
24-05-201924-05-2019 13:07:49 IST
Updated On 26-06-2019 16:36:19 ISTUpdated On 26-06-20192019-05-24T07:37:49.466Z24-05-2019 2019-05-24T07:37:46.646Z - 2019-06-26T11:06:19.954Z - 26-06-2019

ఎప్పుడూ లేనివిధంగా మోడీ జైత్రయాత్ర సాగించారు. సర్వేలు, అంచనాలను ఆయన తోసిరాజని మళ్లీ హస్తిన పీఠం చేజిక్కుంచుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. జనం అంతా మోడీ అంటున్నారు కానీ ఈ విజయం మోడీది కాదని ప్రజలదే అన్నారు. నిజాయితీ కలిగిన సమాజం కోసం పరితపిస్తున్న ప్రజలది ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మరోసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. తన సమయంలోని అన్ని క్షణాలను ప్రజల సేవకే అంకితం చేస్తానని ఆయన అన్నారు. సంపూర్ణ విజయం సిద్ధించిన తర్వాత ఆయన బిజెపి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సరికొత్త భారతదేశం కోసమే దేశ ప్రజలు బిజెపికి మరోసారి అవకాశమిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్వాత్రంత్యం వచ్చాక ఎన్నో ఎన్నికలు జరిగాయని, కానీ ఈ ఎన్నికల్లోనే అత్యంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. 40 డిగ్రీల ఎండల్లోనూ ఓటర్లు తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారని ఆయన అన్నారు. అందరికీ రుణపడి ఉంటానన్నారు మోడీ. ఈ ఎన్నికల్లో ప్రజంతా ధర్మం, న్యాయం వైపు నిలబడ్డారని, ఇందుకు ప్రతి ఒక్క భారతీయుడికి ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి కోసం ప్రజలు కూడా ఎంతో కష్టపడ్డారు. ఉజ్వల భారత్ కోసం ప్రజల మా వెంట నడుస్తున్నారు. ఒక్కరు గెలిచారంటే హిందుస్థాన్ గెలిచినట్లే.. ప్రజాస్వామ్యం గెలిచినట్లే. ప్రజలు గెలిచినట్లే. అందుకే బిజెపి, ఎన్డీయే విజయాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్నాం. పార్టీలు ఏవైనా.. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అని మోడీ తెలిపారు. ప్రధాని మోడీ వెంట పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఉన్నారు. వేదికపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. సభా ప్రాంగణం అంతా మోడీ నామ సమర్పణతో మారుమోగిపోయింది. మోడీ మేనియాతో తెలంగాణలోనూ అద్భుత విజయం సాధించింది బీజేపీ. నాలుగు సీట్లు బీజేపీ ఖాతాలో పడిన సంగతి తెలిసిందే.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
40 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా