ఈసారి స్వీప్ చేసేది ఎవరు..?
07-01-202007-01-2020 08:01:49 IST
Updated On 07-01-2020 12:49:28 ISTUpdated On 07-01-20202020-01-07T02:31:49.299Z07-01-2020 2020-01-07T02:31:23.653Z - 2020-01-07T07:19:28.045Z - 07-01-2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశ రాజధానిలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, తమదే గెలుపని అన్ని పార్టీలు ప్రకటించాయి. కానీ, ఢిల్లీలో ప్రజలనాడి అంతా ఈజీగా ఎవరికీ అంతు చిక్కదు. దీంతో బయటకు ధీమా చూపిస్తున్నా లోలోన మాత్రం అన్ని పార్టీల్లోనూ టెన్షన్ మొదలైంది. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆప్, బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఢిల్లీ ప్రజల తీర్పు ఎప్పుడు వైవిధ్యంగా ఉంటుంది. ఏ పార్టీ తమను పాలించాలో స్పష్టతతో వారు తీర్పు ఇస్తారు. అందుకే ఢిల్లీలో గెలిచే పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తుంటాయి. 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2014లో మొత్తం ఏడు సీట్లు బీజేపీకి ఇచ్చారు ఢిల్లీ ఓటర్లు. ఆ ఎన్నికల తర్వాత ఏడాది లోపే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లలో ఆప్‌ను గెలిపించి చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకోగా కాంగ్రెస్ ఒకటి కూడా గెలవలేకపోయింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. మొత్తం ఏడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం వసాధించగా, ఆప్, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వైపే ప్రజలు ఉంటారని కచ్చితంగా చెప్పలేం. ఇందుకు 2014లో జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. దీంతో ఆప్ ఈ ఎన్నికలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. బీజేపీ కూడా ఈసారి ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలన పట్ల ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వంలో పారదర్శకత, అమలు చేసిన సంక్షేమ పథకాలు, కఠిన నిర్ణయాలు ప్రజలను ఆకర్షించాయి. అయితే, 2014లో కేజ్రీవాల్‌తో ఉన్న చాలా మంది కీలక నేతలు ఇప్పుడు ఆయనను విభేదించి పార్టీని వీడారు. పార్టీలోని ఈ సంక్షోభం ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఇక, ఈ ఎన్నికలకు ఆప్ తరపున ప్రచార బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ తీసుకోవడం కొంత కలిసివచ్చే అవకాశం ఉంది. దేశ రాజధానిలో ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల జోరుతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. అయితే, గత ఎన్నికల్లో కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈసారి అలా ప్రకటించేంత ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరూ ఆ పార్టీకి కనిపించడం లేదు. ఇదే విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ పదేపదే ప్రశ్నిస్తున్నారు. అయితే, గత ఐదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉండటం వల్ల రెండు పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం ఢిల్లీకి సమస్యగా మారింది. అందుకే ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే ప్రజలు గెలిపిస్తారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. 2015కు ముందు వరుసగా పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉండే షీలా దీక్షిత్ గత సంవత్సరం కన్నుమూయడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. ఆమె స్థాయిలో కాంగ్రెస్‌కు ఇప్పుడు ఢిల్లీలో బలమైన నాయకుడు లేని కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. కానీ, రెండు పార్టీలూ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉన్నా ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
12 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
11 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
15 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
18 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
19 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా