newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఈసారి ఎన్నికల ఖర్చెంతో తెలుసా?

04-06-201904-06-2019 08:27:30 IST
Updated On 04-06-2019 08:31:11 ISTUpdated On 04-06-20192019-06-04T02:57:30.104Z04-06-2019 2019-06-04T02:57:11.628Z - 2019-06-04T03:01:11.309Z - 04-06-2019

ఈసారి ఎన్నికల ఖర్చెంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలోనే మనది అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం. మన ఎన్నికలు కూడా చాలా ఖరీదైనవి కూడా. ఎన్నికల సంఘమే వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే.. ఇక పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి  తెరవెనుక ఇంకెంత ఖర్చుచేసి ఉంటాయి. 1998 నుంచి ఆరు రెట్లు ఎన్నికల ఖర్చు పెరిగింది. మన దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల వ్యయం రూ 60 వేల కోట్లు అని ఈసీ వెల్లడించింది. 

Image result for election cost 2019

ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర కెక్కాయి. మహా భారత సంగ్రామాన్ని తలపించిన 2019 భారత సార్వత్రిక ఎన్నికల వ్యయంపై అంతా అవాక్కవుతున్నారు. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు సంయుక్తంగా చేసిన ఎన్నికల ఖర్చు ఏకంగా రూ.60 వేల కోట్లు దాటింది. ఇందులో అధికార బీజేపీ వాటా 45 శాతముండడం విశేషం.

1998 నుంచి 2019 నాటికి ఎన్నికల వ్యయం ఆరు రెట్లు పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ నివేదిక స్పష్టం చేసింది. 1998 సార్వత్రిక ఎన్నికల వ్యయం కేవలం రూ.9 వేల కోట్లు ఉంటే.. అది ఇప్పుడు రూ.60 వేల కోట్లకు చేరింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన ఓట్లను, ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో ఓటుకి సగటున రూ.700 ఖర్చు పెట్టినట్లైంది. 

ఒక్కో ఎంపీ ఖర్చు పెట్టింది అక్షరాలా వంద కోట్ల రూపాయల పైమాటే. ఇక ఒక ఎంపీ స్థానానికి రూ.40 కోట్లు పైగా ఖర్చు పెట్టిన సీట్లలో మాండ్యా, కాలబురగి, షిమోగా, అమేథి, బారామతి, తిరువనంతపురం ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల వ్యయమంతా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన తరువాతదే కావడం విశేషం. షెడ్యూల్‌కి ముందు పార్టీలు ఇచ్చిన ప్రకటనలు, ప్రచారం, నేతల బయోపిక్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ అరవై వేల కోట్లు కూడా పెరిగిపోతుంది. 1998 ఎన్నికల వ్యయంలో బీజేపీ వాటా 20 శాతముంటే, అదిప్పుడు 45 శాతానికి పెరిగింది. 

ఒకప్పుడు కాంగ్రెస్ భారీగా ఖర్చుపెట్టేది. కానీ2019 వచ్చే నాటికి కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు కేవలం 15 నుంచి 20 శాతానికి తగ్గింది. 2019 సార్వత్రిక ఎన్నికల వ్యయ నివేదికకు ముందు మాట రాసిన మాజీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషి.. రాజకీయాల్లో నేరస్తులు, ధన ప్రభావం ఇలానే కొనసాగితే.. రాబోయే ఎన్నికలు కూడా 2019 కంటే గొప్పగా ఏమీ ఉండబోవన్నారు.

ఓటర్ల కోసం రూ.12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు పంపిణి జరిగింది. మరో రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు వరకు ప్రచారం, ప్రకటనలపై వ్యయం చేశారు. రూ. 5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు రవాణా తదితరాల కోసం పార్టీలు వ్యయం చేశాయి. మరో రూ.3 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఇతర ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టారు. ఎన్నికల సంఘం అనుమతించిన ప్రచారం వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇదంతా అధికారికంగా లెక్కవేసింది. అసలు వ్యయం దీనికి నాలుగైదు రెట్లు ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏపీలోనే  రూ10వేల కోట్లకు పైగా ఖర్చుచేశారు. రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?

ఓటు వేయాలంటే 20 శాతం మంది ఓటర్లు డబ్బులు తీసుకున్నారట. ఓటుకి నోటు ఇచ్చే దళారీ వ్యవస్థ గతంలోనూ ఉన్నప్పటికీ, ఈసారి దాదాపు అన్ని పార్టీలు ఇదే పంథా అనుసరించాయి. పోలీసులకు, ఈసీకి దొరకకుండా ఆధునిక పంథాలో నోట్లు ఇచ్చి ఓట్లు దండుకున్నాయి పార్టీలు.

ఏపీలో ఓ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఏసీలు కూడా అందించిందో పార్టీ. మీ ఇంట్లో ఏం లేవో చెప్పండి.. మేం పంపిస్తాం అని ఆ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసింది. చివరాఖరికి ఆ పార్టీ అభ్యర్ధి దారుణంగా ఓడిపోవడం గమనించాల్సిన అంశం. మొత్తం మీద మన ప్రజాస్వామ్యం ఎంత కాస్ట్లీగా మారిపోయిందో చూసి కొంతమంది ప్రజాస్వామ్యవాదులు తెగ ఇదైపోతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle