newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇవాళ సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్.. వ్యూహం ఏంటో?

27-04-202027-04-2020 08:22:32 IST
Updated On 27-04-2020 09:17:53 ISTUpdated On 27-04-20202020-04-27T02:52:32.070Z27-04-2020 2020-04-27T02:52:23.857Z - 2020-04-27T03:47:53.979Z - 27-04-2020

ఇవాళ సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్.. వ్యూహం ఏంటో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ రెండవ దశ కూడా మరోవారం రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ తరువాత ఎలా వ్యవహరించాలి? ఇదే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. మే నాలుగు నుంచి ఏమి చేయాలనేదానిపై కేంద్రం ఇప్పటికే స్థూలంగా ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ విస్తరణను అదుపు చేయడం-ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ  కనిష్ఠ చలనం... గరిష్ఠ పని అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్లనుందని తెలుస్తోంది. దీని ప్రకారం తక్కువ మందితో ఎక్కువ పనిచేయించడం. 

సోమవారం ఉదయం ముఖ్యమంత్రులతో జరపనున్న వీడియో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రణాళిక గురించి చర్చించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు స్వీకరించిన తరువాతనే కార్యాచరణ ప్రణాళికను కేంద్రం ఖరారు చేయనుంది. క్రమేణా ఆంక్షలను సడలించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వనుంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళికలో అనేక అంశాలు ఉండనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కొందరు ఇళ్ల నుంచే విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. కర్మాగారాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసేందుకు భౌతిక దూరం పాటించేలా షిఫ్టు వేళల్లో మార్పులు చేసే అవకాశం. ఈ విషయంలో పారిశ్రామిక సంస్థలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని భావిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తూ కరోనా సోకని గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో ఆర్థిక కార్యక్రమాలు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనుంది. ఇటు దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించనున్నారు మోదీ.మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలంటున్నాయి పలు రాష్ట్రాలు.  ఈనేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో వుంది. 

లాక్‌డౌన్‌ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కేసీఆర్ అంటున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం నిన్న  సమీక్ష చేశారు.ప్రధాని మోదీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమీక్షలో సీఎం అధికారులతో చర్చించారు.

ఏపీలో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా,  231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 835గా ఉన్నాయి.రాజ్ భవన్లోకి కరోనా ప్రవేశించడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 

 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   7 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   8 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle