ఇక రాజ్యసభపై మోడీ ఫోకస్
31-05-201931-05-2019 11:52:39 IST
Updated On 25-06-2019 13:45:56 ISTUpdated On 25-06-20192019-05-31T06:22:39.173Z31-05-2019 2019-05-31T06:22:37.555Z - 2019-06-25T08:15:56.556Z - 25-06-2019

ఎవరూ ఊహించని విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ, ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెంచుకోవడం మీద దృష్టి సారిస్తోంది. 2021 నాటికి రాజ్యసభలో మేజిక్ మార్క్ 124 దాటాలన్న లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ప్రస్తుతం ఎన్డీయేకు రాజ్యసభలో 99 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఏడాదిలో మహారాష్ట్ర, జార్ఘండ్, హర్యానాలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. అంటే ఈ మూడు చోట్ల అధికారం నిలబెట్టుకుని రాజ్యసభకు వీలైనంత మందిని పంపాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఎన్డీయే పక్షాలైన శివసేన, జేడీయూ, ఏఐడీఎంకే పార్టీల సభ్యులు కూడా తోడైతే ఎన్డీయే బలం పెరగడం ఖాయం. అంతేకాదు, 2020లో యూపీ నుంచి ఎంపికైన 10 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగుస్తుంది. ఆ పది సీట్లు కూడా బీజేపీ ఖాతాలోకి రావడం ఖాయం, ఎందుకంటే, యూపీ అసెంబ్లీలో బీజేపీకి భారీ మెజార్టీ ఉంది. అంటే 2021 నాటికి రాజ్యసభలో ఎన్డీయే బలం మ్యాజిక్ మార్క్ 124 దాటడం ఖాయమనేది నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్డీయే పక్షాల మీద ఎక్కువ ఆధారపడకుండా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి కూడా బీజేపీ వ్యూహం రచిస్తోందట. ఎందుకంటే, కీలక బిల్లుల విషయంలో ఎన్డీయే పక్షాల్లోని పార్టీలు ఏ మేరకు కల్సివస్తాయో అన్నది అమిత్ షా, మోడీ అనుమానం. అందుకే వారి మీద పూర్తిగా ఆధారపడే కంటే, తామే సొంతంగా బలం పెంచుకోవాలన్నది వీరిద్దరు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వం బిల్లు పెండిగులో ఉన్నాయి. తటస్థంగా ఉంటే టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు కొన్ని కీలక బిల్లుల విషయంలో సహకరిస్తాయా, లేదా అన్నది కూడా అనుమానం. అందుకే సొంతంగా 124 మంది సభ్యుల బలం ఎలా పెంచుకోవాలన్నదే మోడీ, అమిత్ షా ఆలోచనగా తెలుస్తోంది.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
an hour ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
3 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
4 hours ago

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. సరే Prends ఉంటా
25 minutes ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
7 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021
ఇంకా