ఇక పెద్దల సభలో ప్రియాంక ఫైట్..!
18-02-202018-02-2020 07:21:44 IST
2020-02-18T01:51:44.698Z18-02-2020 2020-02-18T01:51:35.305Z - - 17-04-2021

గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు ప్రియాంక గాంధీ. కొంతకాలం క్రితం వరకు కేవలం ఉత్తర ప్రదేశ్‌కే పరిమితమైన ప్రియాంక గాంధీ ఇప్పుడు పార్టీలోనూ కీరోల్ పోషిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆమె ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత నాలుగైదు నెలలుగా సోదరుడు రాహుల్ గాంధీ కంటే కూడా ప్రియాంక గాంధీ యాక్టీవ్‌గా వ్యవహరిస్తున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి అచ్చులా ఉండే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకత్వం తీసుకోవాలనే డిమాండ్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గత ఆరేళ్లుగా వివిధ ఎన్నికల్లో ఓటమి ఎదురుకాగానే రాహుల్ గాంధీ దింపి ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అందించాలనే వాదనలు కాంగ్రెస్‌లో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. చివరకు ఎన్నికల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ కేవలం ఉత్తరప్రదేశ్ బాధ్యతలు మాత్రమే తీసుకున్నారు. అక్కడ పార్టీ వ్యవహారాలను ఆమే చూసుకుంటున్నారు. కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక క్రమంగా ప్రియాంక గాంధీ జాతీయ రాజకీయాల్లో యాక్టీవ్ అవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మరోసారి బాధ్యతలు తీసుకున్న సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోవడం, ఆమె ఆందోళనల్లో పాల్గొనే పరిస్థితిలో లేకపోవడంతో ప్రియాంక గాంధీ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో రాహుల్ గాంధీ కంటే ఆమెనే ఎక్కువగా కనిపించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఆమెను మరింత యాక్టీవ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో కాంగ్రెస్‌కు గట్టి వాయిస్ లేకుండా పోతోందని, కాబట్టి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించగలరని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి బలమున్న ఏదో ఒక రాష్ట్రం నుంచి ఆమెను రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ఒక రాష్ట్రం నుంచి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపించబోతున్నట్లు జాతీయ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటిసారే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నేరుగా రాజ్యసభకు వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీలో కొందరు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగూ సోనియా గాంధీ పోటీ చేసే అవకాశాలు తక్కువే కాబట్టి ఆమె ఖాళీ చేసే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రియాంకను రాజ్యసభకు పంపించాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసిందని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
20 hours ago
ఇంకా