newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

20-11-201920-11-2019 09:55:58 IST
2019-11-20T04:25:58.835Z20-11-2019 2019-11-20T04:25:57.064Z - - 13-12-2019

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడు దశాబ్దాలుగా బీజేపీతో తాను కొనసాగించిన స్నేహం, పొత్తులు ఇకపై ముగిసిన అధ్యాయమేనని శివసేన ప్రకటించింది. గత కొన్నివారాలుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభనకు గురైనప్పటినుంచి జరుగుతున్న పరిణామాలు బీజేపీ, శివసేన బంధాన్ని శాశ్వతంగా విచ్చిన్న పరిచినట్లే అనిపిస్తోంది. తాజాగా పార్లమెంట్‌ సమావేశాలు ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. 30 ఏళ్లకు పైగా ఉన్న ప్రయాణానికి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లయింది. 

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో బీజేపీ-శివసేన మధ్య ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పదవుల పంపకాలతో ప్రారంభమైన వీరి మనస్పర్థలు కూటమి విచ్ఛినం వరకూ వెళ్లాయి. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన శివసేన వారి విజ‍్క్షప్తి మేరకు కేంద్రమంత్రి పదవి కూడా రాజీనామా చేసింది. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లయింది. 

సోమవారంతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో చర్చలో భాగంగా శివసేనకు ప్రతిపక్షం వైపు సీట్లను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఆదివారమే ప్రకటించారు. మొన్నటి వరకు అధికారపక్షం వైపు కూర్చున సేన ఎంపీలు.. తాజాగా ప్రతిపక్షంలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం సామ్నాలో ఎడిటోరియల్‌ వేదికగా శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమను సంప్రదించకుండానే విపక్ష వైపు తమ స్థానాలను మార్చారని విమర్శించింది. 

‘ఎన్డీయే ఏర్పడటానికి ముఖ్య కారణం దివంగత బాలాసాహెబ్‌ ఠాక్రే. ఆ నాడు హిందుత్వ, జాతీయవాదం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మర్చిపోవడం దారుణం. ఎన్డీయే ఏర్పడిన తొలి నాళ్లలో బీజేపీతో కలసి రావడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. తొలుత బీజేపీతో భాగస్వామ్యం అయిన పార్టీ శివసేన. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు.

ఇంత జరిగాక బీజేపీతో మళ్లీ మేం కలవడంలో అర్థంలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడినా.. బీజేపీతో కలిసేందుకు మేం సిద్ధంగా లేం. బాలా సాహెబ్‌ వర్థంతి సందర్భంగా యావద్దేశమంతా ఆయకు నివాళి అర్పించింది. కానీ అదే రోజున ఆయన  పునాది వేసిన ఎన్డీయే నుంచి శివసేనను బహిష్కరించడం బాధాకరం. అవమానకరం. ఇక నో బీజేపీ, నో ఎన్డీయే’ అంటూ సామ్నా పత్రిక ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

కాగా ఎన్నికల ఫలితాలు ఏర్పడి నెల రోజులు కావస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ వెనక్కి తగ్గడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతో సీఎం పీఠం అధిష్టించాలని శివసేన భావించింది. ఈ మేరకు మూడు పార్టీ మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నా.. ముంగింపు దశకు మాత్రం చేరుకోవడంలేదు. రోజుకో ప్రకటన చేస్తూ కాలం గడుపుతున్నారే తప్ప.. ఓ అంగీకారానికి మాత్రం రావడంలేదు. 

కానీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన కూటమి మధ్య చిచ్చు రేగడంపై ఆరెస్సెస్‌ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు ఏ అంశంపై కీచులాటలకు దిగినా అది ఇరు పార్టీలకు నష్టమని బీజేపీ, శివసేనల విభేదాలను ప్రస్తావిస్తూ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు. స్వార్ధం అనేది చేటని ప్రతి ఒక్కరికీ తెలిసినా చాలా కొద్ది మందే తమ స్వార్ధాన్ని విడనాడతారని నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అధికార పంపకంపై బీజేపీ, శివసేనల ఘర్షణతో ఇరు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle