newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక దేశమంతా 21 రోజుల లాక్ డౌన్.. మోడీ సంచలన ప్రకటన

24-03-202024-03-2020 20:32:12 IST
Updated On 24-03-2020 20:53:25 ISTUpdated On 24-03-20202020-03-24T15:02:12.984Z24-03-2020 2020-03-24T15:02:00.499Z - 2020-03-24T15:23:25.026Z - 24-03-2020

ఇక దేశమంతా 21 రోజుల లాక్ డౌన్.. మోడీ సంచలన ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతా ఊహించినట్టే కరోనాపై ప్రధాని మోడీ యుద్ధం ప్రకటించారు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి పెరిగిపోతున్న వేళ మోడీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 22 రాష్ట్రాలు లాక్ డౌన్లో వున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్. ఎట్టిపరిస్థితుల్లో జనం బయటకి రాకూడదు. లాక్ డౌన్ అంటే కర్ఫ్యూలాంటిదే. ప్రధానిగా చెప్పడంలేదు. మీ కుటుంబసభ్యుడిగా, మీ సేవకుడిగా చెబుతున్నా మూడువారాలపాటు లాక్ డౌన్ లో వుంటే కరోనా పై పోరాటం పూర్తవుతుంది.

లాక్ డౌన్ లక్ష్మణ రేఖను దాటిరావద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే వుండండి. కరోనా అంటే ఇంట్లోనే వుండాలి, కేంద్ర ఆరోగ్యశాఖకు 15 వేల కోట్లు విడుదల చేశామన్నారు ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మోడీ తన సందేశం ఇచ్చారు. కష్టకాలంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మీడియా కృషిని ప్రశంసించారు. స్వంత వైద్యం పనికిరాదని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్లలు అవసరం అన్నారు. మన కోసం, మన పిల్లల కోసం స్వీయ గృహనిర్బంధంలో వుండాలన్నారు. 

జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ ఇదన్నారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం. ప్రతీ నగరం,ప్రతీ ఊరు,ప్రతీ వీధి లాక్డౌన్ లోకి వెళ్లాల్సిందే. వచ్చే 21 రోజుల పాటు ఈ నిర్బంధం అమలులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారిని జయించాలంటే ఈ స్వీయ నిబంధన తప్పదు. లేకుంటే దేశం..మీ కుటుంబం 21 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుందన్నారు. మీ ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణ రేఖ గీయండి. దానిని దాటి ముందుకు రావద్దన్నారు మోడీ. 

రోనా సోకినవారు తొలుత సాధారణంగానే ఉంటారనీ.. కాబట్టి ఇతరులను కలిసే ప్రయత్నం చేయారాదన్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయట పడేందుకు కొన్ని రోజుల పడుతుంది గనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు మోడీ. 

ఈ వ్యాధి బారిన పడిన మొదటి లక్ష మంది గుర్తించడానికి 67 రోజులు పట్టిందనీ, అనంతరం కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య 2 లక్షలకు చేరిందని ప్రధాని తెలిపారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే బాధితుల సంఖ్య 3 లక్షలకు పెరిగిపోయిందన్నారు. రానున్న 21 రోజులు దేశానికి చాలా కీలకమని ప్రధాని అన్నారు.

ఈలాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందనీ.. కానీ, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఈ కఠిన నిర్ణయం తప్పనిసరి అని ప్రధాని అన్నారు. ఈ 21 రోజులు మన ప్రాణాల కంటే ఎక్కువ కాదని, ప్రధాని నుంచి గ్రామస్తుల వరకు సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని ప్రధాని తెలిపారు. 

ఈ మహమ్మారి పట్ల నిర్లక్ష్యం చేయబట్టే చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా లాంటి దేశాలు ప్రస్తుతం చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయని ప్రధాని వెల్లడించారు. అలాంటి పరిస్థితులు మన దగ్గరికి రాకూడదంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు మోడీ. 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle