newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇకపై గుళ్లు ఎన్నికలను గెలిపించవు : ఉమాభారతి

10-11-201910-11-2019 11:10:02 IST
2019-11-10T05:40:02.099Z10-11-2019 2019-11-10T05:39:57.970Z - - 14-04-2021

ఇకపై గుళ్లు ఎన్నికలను గెలిపించవు : ఉమాభారతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అయోధ్యపై తీర్పు భారత రాజకీయాలను మూలమలుపు తిప్పగల మహత్తర ఘటన అని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి ప్రశంసించారు. ఇక నుంచి భారత ఎన్నికల్లో పెద్ద మార్పు చోటుచేసుకుంటుందని, ఎన్నికల్లో ఫలితాలను ఇకనుంచి గుళ్లు గోపురాలు నిర్దేశించలేవని చెప్పారు.

కొన్ని దశాబ్దాలుగా గుళ్లు, మసీదులపై ఎన్నికలు జరిగాయని, అయితే ఇక నుంచి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి వాస్తవ సమస్యలపై ఎన్నికలు జరుగుతాయని ఉమాభారతి తేల్చి చెప్పారు. శనివారం అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు అంతిమ తీర్పు వెలువరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

‘దేశంలో ఇప్పటి వరకు ఎన్నికలు రామమందిరం చుట్టే తిరిగాయి. మందిరం ప్రధానంగానే కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇక నుంచి అలా జరగదు. వాస్తవ సమస్యల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. విద్య, పేదరికం, నిత్యవసరాలు లాంటి సమస్యలపైనే ఎన్నికలు జరుగుతాయి అని ఉమాభారతి వ్యాఖ్యానించారు.

దేశంలో కొన్ని దశాబ్దాలుగా మతతత్వం వర్సెస్ లౌకికత్వం ప్రాతిపదికగా రాజకీయాలు నడుస్తూ వచ్చాయని కానీ కుహనా లౌకిక డ్రామాను ఎండగట్టి ప్రజల మనోభావాలను పట్టం కట్టి జాతిని నడిపించిన ఏకైక నేత ఎల్.కె. అద్వానీయేనని ఉమాభారతి ప్రశంసించారు. ఆయన పాతికేళ్ల క్రితం ప్రారంభించిన రధయాత్రే బీజీపీని, అయోధ్య ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు.

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు భారత రాజకీయాలను కొత్తదిశకు మళ్లించనుందని ఉమాభారతి పేర్కొన్నారు. అద్భుతమైన, నిష్పాక్షికమైన ఈ తీర్పును నేను ప్రశంసిస్తున్నాను. యావద్దేశం ఈ తీర్పును స్వాగతించడం నిజంగా అద్భుతం. సంతోషకరం కూడా. కచ్చితంగా ఇది భారత రాజకీయాలను వినూత్న దశకు తీసుకెళుతుంది అని ఆమె కొనియాడారు.

ఒకప్పుడు అయోధ్య వీధుల్లో తిరుగాడుతున్నప్పుడు తననెవరయినా కాల్చివేస్తారేమో అని భావించేదాన్ని, కానీ ఈరోజు పరిణామాలు చూస్తుంటే అనిర్వచనీయ భావంతో తేలిపోతున్నానని ఉమాభారతి చెప్పారు. అయోధ్య తీర్పును ప్రాతిపదికగా తీసుకుని ముందుకు నడవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఇకపై గుళ్లు రాజకీయాలను శాసించలేవని, రోటీ కపడా మక్కన్ వంటి నిజమైన సమస్యలే ఎన్నికల ప్రచారాంశాలుగా ఉంటాయని ఉమాభారతి వ్యాఖ్యానించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle