newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇందిర తర్వాత ఆ ఘనత మోడీదే!

24-05-201924-05-2019 07:42:11 IST
Updated On 26-06-2019 17:00:55 ISTUpdated On 26-06-20192019-05-24T02:12:11.177Z24-05-2019 2019-05-24T02:11:22.503Z - 2019-06-26T11:30:55.682Z - 26-06-2019

ఇందిర తర్వాత ఆ ఘనత మోడీదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ వ‌చ్చి, న‌రేంద్ర మోడీ మ‌రోసారి ప్ర‌ధాని అయితే, 48 ఏళ్ల రికార్డ్ ఆయ‌న తిర‌గ‌రాసిన‌ట్లే. ఎందుకంటే 48 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒకే పార్టీ, ఒకే వ్య‌క్తి వ‌రుస ఎన్నికల్లో గెలిచి ప్ర‌ధాని అవ్వ‌డం జ‌ర‌ుగుతోంది. ఎందుకంటే, 1967లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ఇందిరాగాంధీ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో గెలిచి అధికారం ద‌క్కించుకుంది.

ఆ త‌ర్వాత అంటే, 1971 ఎన్నిక‌ల్లో పూర్తిస్థాయి మెజార్టీతో ఇందిరాగాంధీ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఇలా వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో గెలిచిన ఘ‌న‌త అప్ప‌ట్లో ఇందిరా గాంధీ సొంత‌మైంది. 

ఎందుకంటే, 1952, 1957, 1962 ఎన్నిక‌ల్లో పూర్తిస్థాయి మెజార్టీతో ప్ర‌ధాని అయిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ త‌ర్వాత‌, ఇందిరా గాంధీనే వ‌రుస‌గా రెండుసార్లు ప్ర‌ధాని అయ్యారు. ఇప్ప‌టి దాకా దేశంలో 16 సార్లు జ‌రిగిన పార్ల‌మెంట‌రీ ఎన్నికల్లో నెహ్రూ మిన‌హా ఇందిరాగాంధీనే రికార్డ్ నెల‌కొల్పారు. మొద‌టిసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 398 సీట్లు వ‌చ్చాయి. 

ఆ త‌ర్వాత రెండోసారి పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 395 సీట్లు, మూడోసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 394 సీట్లు వ‌చ్చాయి. ఈ మూడు సార్లు నెహ్రూ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఇక 1967లో 303 సీట్లు, 1971లో 372 సీట్ల‌తో ఇందిరాగాంధీ వ‌రుస‌గా రెండుసార్లు ప్ర‌ధాని అయ్యారు.

ఇక 1980 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇందిరాగాంధీ మూడోసారి ప్ర‌ధాని అయినా, ఆ త‌ర్వాత ఆమె మ‌ర‌ణంతో, 1984లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అప్పుడు ప్ర‌ధానిగా రాజీవ్ గాంధీ బాధ్య‌త‌లు నెర‌వేర్చారు. 

ఇక 1999 నుంచీ 2004 దాకా రెండుసార్లు ప్ర‌ధానిగా అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్ర‌ధాన మంత్రిగా ఉన్నా, బీజేపీకి పూర్తిస్తాయి మెజార్టీ లేదు. ఇత‌ర పార్టీల భాగ‌స్వామ్యంతో అట‌ల్ బిహారీ వాజ్ పాయ్ ప్ర‌ధానిగా ప‌నిచేశారు. ఇక  2004 నుంచి 2014 దాకా మ‌న్మోహ‌న్ వ‌రుస‌గా రెండుసార్లు ప్ర‌ధాన 

మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించినా, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లేదు. యూపీఏ భాగ‌స్వామ్య పార్టీల‌తో ఆయ‌న ప్ర‌ధానిగా ప‌నిచేశారు. కానీ 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. ఈ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ వ‌చ్చి, న‌రేంద్ర మోడీ మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి అయితే, 48 సంవ‌త్స‌రాల చ‌రిత్ర రిపీట్ అయిన‌ట్లే.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle