newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇండో-చైనా బోర్డ‌ర్‌లో యుద్ధ మేఘాలు

17-06-202017-06-2020 09:05:23 IST
Updated On 17-06-2020 11:47:20 ISTUpdated On 17-06-20202020-06-17T03:35:23.004Z17-06-2020 2020-06-17T03:35:14.885Z - 2020-06-17T06:17:20.959Z - 17-06-2020

ఇండో-చైనా బోర్డ‌ర్‌లో యుద్ధ మేఘాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా మరోసారి రెచ్చిపోయింది. మంచుకొండల్లో భారత జవాన్లపై పాశవికదాడికి తెగబడింది. లద్దాఖ్‌లో చైనా-భారత్‌ బలగాల మధ్య ఘర్షణ వాతావరణంలో జవాన్లు భారీగా ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. 20 మంది భారత జవాన్ల వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. రాళ్లు, రాడ్లతో చైనా సైనికుల దాడిపి తిప్పికొట్టిన మన సైనికులు చైనా సైన్యానికీ కూడా భారీ నష్టం కలిగించారు. 11 మంది భారత జవాన్ల మృతదేహాలను చైనా అప్పగించింది. ఛిద్రమైన స్థితిలో మృతదేహాలను అప్పగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. 

తాజా పరిస్థితులపై కేంద్రం సీరియస్ అయింది. త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. దేశ సార్వభౌమత్వంపై రాజీపడమని తగిన చర్యలు తీసుకుంటామని భారత్ తెలిపింది. అక్కడి పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రధాని మోదీకి వివరించారు. అంతకుముందు ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌, మహాదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఇక.. ఈ ఘర్షణలకు సంబంధించి భారత సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత, చైనా సైన్యాలకు సోమవారం రాత్రి, మంగళవారం ఘర్షణ జరిగిన గాల్వన్‌ ప్రాంతంలో ఇరువర్గాలూ వెనక్కి తగ్గాయని అందులో పేర్కొంది. భారత్‌-చైనా సరిహద్దుల్లో  సైనికులు మృతి చెందడం 1975 తర్వాత.. అంటే నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని టులుంగ్‌ లా వద్ద నలుగురు భారతీయ సైనికులు మరణించారు.

ఏప్రిల్ నుంచి భారత సరిహద్దులో లడ్డాఖ్ ప్రాంతంలో చైనా భారీగా బలగాలను మోహరించింది. భారత సైన్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. పెద్దఎత్తున సైనికులను సరిహద్దుకు తరలించింది. ఈ క్రమంలో గత నెలలో పాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరుదేశాల సైనికులూ ఘర్షణ పడ్డారు. రోజురోజుకూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 6న మేజర్‌ జనరల్‌ స్థాయిలో సమావేశం నిర్వహించారు. సైన్యాలను ఉపసంహరించాలని భావించాయి. 

అందులో భాగంగా  సోమవారం రాత్రి ఇరు వర్గాల సైనికులూ వెనక్కి మళ్లే ప్రక్రియ ప్రారంభించారు. ఉన్నట్టుండి చైనా సైనికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని రాళ్లు, ఇనప రాడ్లతో దాడికి దిగినట్టు సమాచారం. ఆ సమయంలో మన సైనికులు వారికి దీటుగా బదులిచ్చారు. గాల్వన్‌ ఘర్షణపై చైనా నిరసన తెలిపింది. భారత సైనికులే తమ భూభాగంలోకి వచ్చారని, సైనికులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్న భార‌త ప్ర‌భుత్వం.. త్రివిధ ద‌ళాల అధిప‌తుల‌తో ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇప్ప‌టికే రెండుసార్లు అత్యున్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వహించారు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   6 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle