newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇండియా పేరు మార్పు కేంద్రం పని.. జోక్యం చేసుకోలేనన్న సుప్రీం

05-06-202005-06-2020 07:03:22 IST
Updated On 05-06-2020 09:04:56 ISTUpdated On 05-06-20202020-06-05T01:33:22.548Z05-06-2020 2020-06-05T01:33:19.954Z - 2020-06-05T03:34:56.652Z - 05-06-2020

ఇండియా పేరు మార్పు కేంద్రం పని.. జోక్యం చేసుకోలేనన్న సుప్రీం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియా పేరును భార‌త్‌గా మార్చాల‌న్న పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కావాల‌నుకుంటే ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించింది. కాగా ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా పేరును భార‌త్ లేదా హిందుస్తాన్‌గా మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.‌ ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు. 

దీనిపై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇండియాను ఇప్ప‌టికే భార‌త్ అని పిలుస్తున్నార‌ని తెలిపింది. అయినా ఈ విష‌యంలో తాము క‌ల‌గ‌జేసుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది. పేరు మార్పునకు సంబంధించి పిటిష‌న్ కాపీ మంత్రిత్వ శాఖ‌కు ఇవ్వాల‌ని సూచించింది. అప్పుడు ప్ర‌భుత్వమే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుందని పేర్కొంది. భారత రాజ్యాంగంలో కూడా ఇండియాను భారత్ అని పొందుపర్చారని కోర్టు తెలిపింది.

కాగా 'ఇండియా' అనే పదం గ్రీకు నుంచి ఉద్భ‌వించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ పేరు తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్ త‌రాలు గ‌ర్విస్తాయ‌న్నారు. అంతేకాక‌ దేశ చ‌రిత్ర‌లోనూ భార‌త్ మాతాకీ జై అనే నినాదాలున్నాయ‌న్నారు. ఇండియా అనే పేరును తొల‌గించ‌డం వ‌ల్ల విముక్తి సాధించిన‌వాళ్ల‌మ‌వుతాం అని వాదించారు. కాగా గ‌తంలోనూ ఇండియా పేరు మార్చాలంటూ 2016లో పిటిష‌న్ దాఖల‌వ‌గా సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపారేసింది. 

రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా అన్న పేరు స్థానంలో భారత్‌ లేదా హిందుస్తాన్‌ అన్న పదం వాడేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్‌ 2వ తేదీనుంచి విచారిస్తోంది. ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పేరు మార్పునకు సంబంధించి కేంద్రం రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్‌లో మార్పులు చేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే అందుబాటులో లేకపోవడంతో విచారణ జూన్‌ 2వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే.

దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత మన దేశాన్ని భారత రాజ్యాంగం రెండు పేర్లతో పిలిచింది. ఒకటి ఇండియా. రెండు భారత్. ఇలా రెండు పేర్లతో పిలవడానికి కూడా అప్పట్లో చాలా చర్చలు జరిగాయి. బ్రిటిష్ వారి పాలనలో ఇండియాను  హిందూస్తాన్ అని కూడా పిలిచేవారు. కానీ ఆ పేరును రాజ్యాంగ సభలోని కొందరు వ్యక్తులు వ్యతిరేకించారు. 

భారత రాజ్యాంగం ముసాయిదా రచించిన బీఆర్ అంబేడ్కర్ ప్రపంచవ్యాప్తంగా మన దేశం పేరు ఇండియా అని వ్యాప్తిలో ఉందని, కాబట్టి ఇండియా పేరును మనం నిలుపుకోవలసిందేనని వాదించారు. ఈ విషయం కూడా వాదవివాదాలకు దారితీసింది. దీంతో మధ్యేమార్గంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1) ప్రకారం ఇండియా అనే భారత్ వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది అని పేర్కొన్నారు. 

అయితే తాజా పిటిషన్ దేశం పేరు భారత్‌ అని మాత్రమే ఉండాలని, రెండు పేర్లు అవసరం లేదని పేర్కొంది. ఇది తన పరిధిలోనిది కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడింది.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   42 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   35 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle