newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ మూడుసీట్లు కాంగ్రెస్‌కి అందనిద్రాక్షేనా?

19-05-201919-05-2019 09:07:49 IST
Updated On 27-06-2019 15:16:25 ISTUpdated On 27-06-20192019-05-19T03:37:49.467Z19-05-2019 2019-05-19T03:37:45.339Z - 2019-06-27T09:46:25.563Z - 27-06-2019

ఆ  మూడుసీట్లు కాంగ్రెస్‌కి అందనిద్రాక్షేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
125 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ మూడు సీట్లు ప్రతిష్టాత్మకంగా మారాయ‌ట‌. గ‌త ఐదు ద‌ఫాలుగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌లేదు స‌రిక‌దా, కొన్నిసార్లు డిపాజిట్ కూడా కోల్పోయింద‌ట‌. ఎలాగైనా, ఎవ‌రితో పొత్తు లేకుండా గెల‌వాల‌ని ఆ పార్టీ తెగ‌తాప‌త్ర‌య ప‌డుతోంది. 

ఈ ఎన్నిక‌ల్లో సాధ్యం కాక‌పోయినా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా గెలవాల‌ని ఉవ్విళ్లూరుతోంద‌ట‌. ఆమూడు సీట్లలో ఒక‌టి కేర‌ళ‌లోని పొన్నానీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం. 1951లో దేశంలో జ‌రిగిన మొదటి సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో కేరళలోని పొన్నానీ లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కిసాన్‌మజ్దూర్‌ ప్రజా పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 

ఇక 1957లో పొన్నానీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగనట్టుగా రికార్డులు లేవు. ఈసీ కూడా తన అధికారిక రికార్డుల్లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఆ తర్వాత 1962, 1967, 1972లో జరిగిన ఎన్నికల్లో పొన్నానీ నుంచి సీపీఐ(ఎం) హ్యాట్రిక్‌ విజయం సాధించింది. ఆ తర్వాత నుంచీ ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి పొన్నానీ ఎంపీ సీటులో కాంగ్రెస్ పార్టీ త‌న అభ్య‌ర్థిని నిలబెట్టలేదు. 

దీంతో 1977 నుంచీ 2014 ఎన్నిక‌ల దాకా ఈ సీటులో ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్ గెలుస్తూనే ఉంది. అంటే 11 ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన‌ట్లు అయింది. ప్ర‌తిసారీ పొత్తు పెట్టుకోవ‌డం, ఐయూఎంఎల్ అభ్య‌ర్థిని బ‌ల‌ప‌ర్చ‌డం మిన‌హా, ఒంట‌రిగా పోటీ చేసే స‌త్తా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి పొన్నానీ ఎంపీ సీటు మీద బెంగ పెట్టుకుంద‌ట‌. 

ఇక ఒడిషాలోని కేంద్ర‌పారా పార్ల‌మెంట్ సీటులో కూడా ఇదే త‌ర‌హాలో ఉంది.  ఈ సీటులో కూడా 1951 ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, మ‌ళ్లీ ఇప్ప‌టి దాకా గెలవ‌లేదు. ప్ర‌తిసారీ అభ్య‌ర్థిని బ‌రిలో దింప‌డం, ఓట‌మి మూట‌గ‌ట్టుకోవ‌డం కాంగ్రెస్ పార్టీకి సాధార‌ణ‌మై పోయింది. ఈ ఎన్నిక‌ల్లో కూడా ఆ పార్టీ అభ్య‌ర్థి బ‌రిలో ఉన్నారు. 

ఈసారి ల‌క్ ఎలా ఉంటుందో అన్న భ‌యం కాంగ్రెస్ పెద్ద‌ల‌ను వెంటాడుతోంది. ఇక ప‌శ్చిమ బెంగాల్లోని హుగ్లీ ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీని అంద‌ని ద్రాక్ష‌గా మారిందిట‌.

1952 నుంచీ హుగ్లీ ఎంపీ సీటుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం 1984లో మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ త‌ర్వాత, అంత‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి హుగ్లీ సీటులో చోటు ద‌క్క‌లేదు. ఈ ఎన్నిక‌ల్లో కూడా ప‌రిస్థితి ఎలా ఉంటుందో అన్న భ‌యం కాంగ్రెస్ నేత‌ల‌ను వెంటాడుతోందట‌.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle