newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ ముస‌లోళ్ల‌ను ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌డం లేదా..?

26-08-202026-08-2020 08:32:53 IST
Updated On 26-08-2020 09:28:02 ISTUpdated On 26-08-20202020-08-26T03:02:53.893Z26-08-2020 2020-08-26T03:02:48.013Z - 2020-08-26T03:58:02.708Z - 26-08-2020

ఆ ముస‌లోళ్ల‌ను ఎలా వ‌దిలించుకోవాలో తెలియ‌డం లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
130 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. క‌నీసం ఆ పార్టీని న‌డిపించే నాయ‌కుడిని కూడా ఎంచుకోలేని ద‌య‌నీయ స్థితిలోకి కాంగ్రెస్ వెళ్లిపోయింది. గాంధీ కుటుంబానికే కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఉండాల‌ని కొంద‌రు, వ‌ద్ద‌ని మ‌రికొంద‌రు చీలిపోయే దాకా ప‌రిస్థితి వ‌చ్చింది.

అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బ‌య‌ట‌కు నాయ‌క‌త్వ ఎంపిక వ్య‌వ‌హారం మాత్ర‌మే క‌నిపిస్తున్నా అంత‌ర్గ‌తంగా రాహుల్ గాంధీ వైరాగ్య‌మే కాంగ్రెస్ పార్టీకి అస‌లు స‌మ‌స్య‌గా ఉంది. పార్టీని న‌డిపించేందుకు త‌న‌కు ఉన్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించుకోలేక‌పోతుండ‌ట‌మే ఈ సంక్షోభానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి క్యాడ‌ర్ ఉంది. కానీ, న‌డిపించే లీడ‌ర్ లేడు. దేశంలో గ్రామ‌గ్రామా‌న కాంగ్రెస్ పార్టీకి కార్య‌క‌ర్త‌లు, సంప్ర‌దాయ ఓట్లు ఉన్నాయి. కాలం క‌లిసి వ‌స్తే ఫీనిక్స్ ప‌క్షి లాగా ఎగిరే సామ‌ర్థ్యం కాంగ్రెస్‌కు ఉంది. ఆ పార్టీ గ‌త చ‌రిత్ర ఇదే చెబుతోంది. రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, కేర‌ళ‌, చ‌త్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంది. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా ఆ పార్టీ మ‌ళ్లీ పుంజుకునే ఛాన్సులు ఉన్నాయి. కానీ, ఈ అవ‌కాశాల‌ను వినియోగించుకునే నాయ‌కుడే లేక ఆ పార్టీ స‌త‌మ‌త‌మ‌వుతోంది.

రాహుల్ గాంధీ రాజ‌కీయ ఆరంగేట్రం చేశాక కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్ ఆయ‌నే అని ప్ర‌తి ఒక్క‌రు అనుకున్నారు. అంద‌రూ అనుకున్న‌ట్లే ఆయ‌న కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు అయ్యారు. సోనియా గాంధీ ఇక రిటైర్ అయిన‌ట్లే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప‌గ్గాలు వ‌దిలేశారు. ఓట‌ముల‌కు బాధ్య‌త వ‌హిస్తూ ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతారు. కానీ, ఆయ‌న పార్టీపై, ఆ పార్టీలోని కొంద‌రు నేత‌ల‌పై అలిగి ఈ బాధ్య‌త‌లను వ‌దులుకున్నార‌ని చెప్ప‌డ‌మే స‌మంజ‌సం.

వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన ఆ పార్టీ ఇప్పుడు వృద్ధ నేత‌ల భారాన్ని మోయ‌లేక‌పోతోంది. వ‌య‌స్సు మ‌ళ్లినా ఇంకా రాజ‌కీయాల‌పై మోజు త‌గ్గ‌ని నేత‌లు కాంగ్రెస్‌ను శాసించాల‌ని భావిస్తున్నారు. ఒక‌వైపు బీజేపీ లాంటి పార్టీలో అడ్వాని, ముర‌ళి మ‌నోహ‌ర్ జోషి లాంటి నేత‌ల‌నే పార్టీ కోసం ప‌క్క‌కు జ‌రిపితే కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా వృద్ధ నేత‌ల‌కే పెద్ద‌పీట ప‌డుతోంది. నిజానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే భ‌విష్య‌త్ రాజ‌కీయాల గురించి బాగానే ఆలోచించింది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీకి ప్ర‌త్యేకంగా ఒక టీమ్ త‌యారు చేశారు.

స‌చిన్ పైలెట్‌, జ్యోతిరాధిత్య సింథియా వంటి యువనేత‌ల‌తో రాహుల్ గాంధీ టీమ్ ఉండేది. ఇంచుమించు అన్ని రాష్ట్రాల‌కు చెందిన కొంద‌రు యువ నేత‌లు రాహుల్ గాంధీ టీమ్‌లో ఉండేవారు. ఇక భ‌విష్య‌త్‌లో రాహుల్ నాయ‌కుడిగా ఆయ‌న టీమ్‌లోని యువ నేత‌లు అంతా క‌లిసి పార్టీని న‌డిపించాల‌నేది కాంగ్రెస్ ప్లాన్‌గా ఉండేది. కానీ, కాలం గ‌డిచినా కొద్ది కాంగ్రెస్ అంచ‌నాలు త‌ల‌క్రిందులు అవుతూ వ‌స్తున్నాయి.

యువ‌నేత‌లు ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్న వారికి అవ‌కాశం ఇవ్వ‌డానికి కాంగ్రెస్ సీనియ‌ర్లు సిద్ధంగా లేరు. అస‌లు వారు త‌మ స్థానాల‌కు అతుక్కుపోయి కూర్చొని ఇంకా కాంగ్రెస్‌లో తాము చెప్పిందే న‌డ‌వాల‌ని  అనుకుంటున్నారు.

వీరి ఆలోచ‌న‌లు ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు స‌రిపోవ‌డం లేదు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, బీజేపీ రాజ‌కీయ వ్యూహాల‌ను వీరు గుర్తించ‌లేక‌పోతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ్యోతిరాధిత్య సింథియా అనే యువ‌నేత పార్టీని ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌మ‌ల్‌నాథ్ అనే వృద్ధ నేత‌కు ఇచ్చారు.

రాజ‌స్థాన్‌లో స‌చిన్ పైలెట్‌ను కాద‌ని మ‌రో సీనియ‌ర్ అశోక్ గెహ్లోట్‌కు సీఎం పీఠం అప్ప‌జెప్పారు. ఇలా ఎక్క‌డిక‌క్క‌డ సీనియ‌ర్ నేత‌లు జూనియ‌ర్ నేత‌ల‌కు ఆటంకంగా ఉన్నారు. అందుకే, పార్టీని న‌డిపించాలంటే సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టాల‌నేది రాహుల్ గాంధీ ఆలోచ‌న‌.

కానీ, వారేమో ఇంట్లో కూర్చోడానికి సిద్ధంగా లేరు. వారిని బ‌లవంతంగా అయినా సాగ‌నంపే ధైర్యం సోనియా, రాహుల్ చేయ‌డం లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అస‌లు స‌మ‌స్య ఇదే. కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు గాంధీ కుటుంబానికి చెందిన వారికే ద‌క్కాల‌ని చాలామంది నాయ‌కులు కోరుతున్నారు. త‌మ మ‌ద్ద‌తు రాహుల్ గాంధీకే అంటూ ఏఐసీసీకి లేఖ‌లు రాస్తున్నారు. కానీ, రాహుల్ మాత్రం సీనియ‌ర్లు త‌ప్పుకుంటే గానీ పార్టీ బాధ్య‌త‌లు తీసుకునేందుకు సిద్ధంగా లేర‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ సంక్షోభం ఎలా స‌ద్దుమ‌నుగుతుందో చూడాలి.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle