ఆ నాలుగే మూడోసారి గెలిపించాయి..!
12-02-202012-02-2020 07:39:12 IST
2020-02-12T02:09:12.734Z12-02-2020 2020-02-12T02:08:03.438Z - - 23-04-2021

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. 53 శాతం ఓట్లతో 62 సీట్లు సాధించి చారిత్రక విజయం సాధించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏకపక్షంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ఢిల్లీ ప్రజలు రాష్ట్రానికి వచ్చేసరికి మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండాలని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొట్టి అరవింద్ కేజ్రీవాల్ సాధించిన భారీ విజయంతో దేశంలో ఆయన హీరోగా నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. జాతీయ అంశాలను, హిందుత్వను ముందుకు తీసుకొచ్చింది. ప్రచారం కోసం హేమాహేమీలను రంగంలోకి దింపింది. ప్రధాని నరేంద్ర మోడీ, రాజకీయ చాణక్యుడిగా ముద్రపడిన అమిత్ షా ఢిల్లీలో గెలుపు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కానీ, ఇవేవీ ఢిల్లీలో పని చేయలేదు. బీజేపీ ప్రయోగించిన అన్ని వ్యూహాలను అరవింద్ కేజ్రీవాల్ ఒంటిచేత్తో చిత్తు చేసి విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గత ఐదేళ్ల పదవీ కాలంలో అమలు చేసిన పథకాలే ఆయనను ఎన్నికల్లో మరోసారి గెలిపించాయి. విద్య, వైద్యం, విద్యుత్, మహిళా భద్రతకు ఆయన బాగా ప్రాధాన్యత ఇచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలు బాగా చదువుకోవాలని కలలు కంటారు. అందుకే ప్రైవేటు స్కూళ్లపై ఆధారపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితిని కేజ్రీవాల్ ఢిల్లీలో పూర్తిగా మార్చేశారు. విద్యకు ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా అభివృద్ధి చేశారు. పిల్లలకు మంచి విద్యను అందించారు. పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే బస్తీల్లో సర్కారు వైద్య సదుపాయాలను ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగుపరిచింది. పేదలకు నాణ్యమైన వైద్యం అందించింది. దేశమంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ఇందుకు భిన్నంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యాన్ని అందించేందుకు అరవింద్ కేజ్రీవాల్ కృషి చేశారు. ఇది ఢిల్లీ వాసులను బాగా ఆకట్టుకుంది. విద్యుత్ సబ్సిడీలు కూడా ఆమ్ ఆద్మీ విజయానికి ప్రధాన కారణం. పేదలకు విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈసారి అధికారంలో సబ్సిడీలను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. తాము ఆప్ కంటే మిన్నగా విద్యుత్ సబ్సిడీలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు కేజ్రీవాల్‌నే నమ్మారు. మహిళా భద్రత కోసం పెద్దపీట వేయడం కూడా కేజ్రీవాల్ విజయానికి కారణమైంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత రవాణా సదుపాయాలను కేజ్రీవాల్ కల్పించారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేసే ఢిల్లీలో వారికి ఇది ఎంతో ఉపయోగపడింది. ఇలా విద్య, వైద్యం, విద్యుత్, వుమెన్ సెక్యూరిటీ అరవింద్ కేజ్రీవాల్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకున్న ఢిల్లీ వాసులు ఎనిమిది నెలల క్రితం మొత్తం ఏడు పార్లమెంటు సీట్లను బీజేపీకి కట్టబెట్టారు. కానీ, రాష్ట్రంలో మాత్రం మరోసారి తమకు కేజ్రీవాల్ కావాలని కోరుకున్నారు. కేజ్రీవాల్‌ను నిలువరించేందుకు బీజేపీ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఏఏ, షాహిన్‌బాగ్ ఆందోళనలు, రామ్ మందిర్, పాకిస్తాన్ వంటి అనేక అంశాలను ఎన్నికల్లో ప్రస్తావించినా ప్రజలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా మంచి పాలన అందించిన కేజ్రీవాల్‌నే కోరుకున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
a minute ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా