newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ నగరాలపై కేంద్రం ఫోకస్.. సడలింపులపై ఆక్షేపణలు

21-04-202021-04-2020 11:42:13 IST
Updated On 21-04-2020 12:46:52 ISTUpdated On 21-04-20202020-04-21T06:12:13.662Z21-04-2020 2020-04-21T06:12:01.585Z - 2020-04-21T07:16:52.815Z - 21-04-2020

ఆ నగరాలపై కేంద్రం ఫోకస్.. సడలింపులపై ఆక్షేపణలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కేసులు భారీగా పెరిగాయి. 18వేల కేసులు దాటిపోగా.. 590 మంది వరకూ మరణించారు. గత నెలలో విధించిన కరోనా లాక్ డౌన్ మొదటి విడత ముగిసింది. రెండవ విడత కరోనా లాక్ డౌన్ ఈ నెల 14 నుంచి మే 3వ తేదీ వరకూ కొనసాగనుంది. దేశంలో కరోనా వైరస్ పోరుకు కేంద్రం లాక్ డౌన్ విధించి పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఆయా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సీఎంలతో సంప్రదింపులు జరుపుతూనే వుంది. 

రాష్ట్రాలలో పరిస్థితుల పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేంద్రం అవసరమయిన వైద్య పరికరాలను రాష్ట్రాలకు పంపిస్తోంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు నీరుగారిపోకుండా చూడడంపై కేంద్రం దృష్టి సారించింది. క్షేత్రస్థాయికి అధికారుల్ని పంపించి పరిస్థితిని అదుపులోకి తేవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్‌(ఇండోర్‌), పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా) సహా మరికొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర (ముంబయి, పుణె), రాజస్థాన్‌ (జైపుర్‌)లలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఏమాత్రం సడలించినా.. వైరస్‌ మరింతగా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించింది. పరిస్థితి చేజారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనుంది. 

గోవా, మణిపూర్ రాష్ట్రాలు కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా అవతరించాయి. అదే తరహాలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న చోట్ల పాజిటివ్ కేసులు లేకున్నా నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చూస్తోంది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ఆరు నగరాలను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. ఆయా మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను మూడు రోజుల్లో అక్కడికి పంపించనున్నట్లు తెలుస్తోంది. 

నాలుగు రాష్ట్రాల్లో సామాజిక దూరం నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేయడం, ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతుండడంపై కేంద్రం సీరియస్ అయింది. అవసరమయితే అక్కడికి కేంద్రం బృందాలను పంపించనుంది.  కొన్నిచోట్ల పట్టణ ప్రాంతాల్లో సిటీ బస్సులు తిరుగుతుండడంపై, అటు కేరళలో కొన్ని నిబంధనల్ని సడలించడం కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. హాట్‌స్పాట్లు ఉన్న జిల్లాల్లో తగిన చర్యలు చేపట్టకుండా వదిలేస్తే దేశంలోని ఇతర చోట్లకూ ఆరోగ్యపరమైన తీవ్ర ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదివరకు జారీ చేసిన జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా స్పష్టం చేశారు.

కరోనా నిబంధనలు పాటించని వారిపై  కఠిన చర్యలను తీసుకోవాలే తప్ప సడలింపులు వద్దని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం కుదరదని కేరళతో సహా పలు రాష్ట్రాలకు కేంద్రం స్ఫష్టమయిన ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులను అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు.  లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ సీజ్‌ చేస్తున్నారు. తాజాగా మాస్క్‌లు లేని వారిని గుర్తిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా బయటకు వస్తున్న వారికి  జరిమానాలు విధిస్తున్నారు. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   27 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   20 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle