newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదట

07-07-202007-07-2020 08:35:47 IST
Updated On 07-07-2020 11:16:22 ISTUpdated On 07-07-20202020-07-07T03:05:47.195Z07-07-2020 2020-07-07T03:05:40.387Z - 2020-07-07T05:46:22.738Z - 07-07-2020

ఆ జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వీరవిహారం సాగుతూనే వుంది. ప్రాణాల‌ను హ‌రిస్తున్న‌ కరోనా వైరస్ దేశ‌మంత‌టా పాకిపోయింది. అయితే దేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా న‌మోదుకాక‌పోవ‌డం విశేషం. మ‌రోవైపు దేశంలోని 81 జిల్లాల్లో వెయ్యికిపైగా క‌రోనా కేసులు న‌మోదై, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ద‌డ పుట్టిస్తున్నాయి. ఇదే విధంగా దేశంలో క‌రోనా కేసుల‌కు సంబంధించి పూర్తి డేటా అందుబాటులో ఉండ‌టం లేద‌ని తెలుస్తోంది. 

దేశంలోని లక్షద్వీప్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్ము క‌శ్మీర్‌ల‌లోని 16 జిల్లాల్లో ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. అలాగే 250కి పైగా జిల్లాల్లో 100 కన్నా తక్కువ, 143 జిల్లాల్లో 100 నుంచి 200 కేసులు ఉన్నాయి. మరోవైపు కనీసంగా 70 జిల్లాల్లో అధికారికంగా 1,000కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో, రాష్ట్ర రాజధాని ప్రాంతంలో అత్యధిక కేసులు ఉన్నాయి. 

మహారాష్ట్రలోని 2 లక్షల కేసులలో 42 శాతం ముంబైలోనే ఉన్నాయి. అలాగే తమిళనాడులోని 1.07 లక్షల కేసుల్లో 62 శాతం చెన్నైలోనే ఉన్నాయి.ప్రస్తుతం ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారత్ మూడవ స్థానానికి చేరుకుంది. దేశంలో కరోనా టెస్టులు కోటి దాటాయి. రికవరీ అవుతున్న కరోనా రోగుల సంఖ్య పెరగడం కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది.  ఆదివారం ఒక్కరోజు 1,80,596 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 24,248 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. 

రోజుకు 2 ల‌క్ష‌ల 15 వేల 655 శాంపిల్స్ చొప్పున పరీక్షించిన‌ట్లు, గ‌డిచిన అయిదు రోజుల్లో ప‌ది ల‌క్ష‌ల టెస్టులు చేసిన‌ట్లు ఆయన తెలిపారు. దేశంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 1100 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా టెస్టులు అనూహ్యంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle