‘‘ఆ జర్నలిస్ట్‌ని వెంటనే విడిచిపెట్టండి’’
11-06-201911-06-2019 12:30:26 IST
Updated On 24-06-2019 12:24:13 ISTUpdated On 24-06-20192019-06-11T07:00:26.529Z11-06-2019 2019-06-11T07:00:24.704Z - 2019-06-24T06:54:13.237Z - 24-06-2019

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ముఖ్యమంత్రిని అవమానించారన్న ఆరోపణలతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. అతడిని వెంటనే విడుదల చేయాలని యూపీ సర్కార్ ని ఆదేశించింది.
ప్రశాంత్ అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఆయనను ఎందురు అరెస్ట్ చేశారు? ఆయనేమైనా మర్డర్ చేశాడా అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రశాంత్‌ను విడుదల చేసి యూపీ ప్రభుత్వం తన పెద్ద మనసు చాటుకోవాలని తీర్పులో స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
యూపీలో ఇటీవల ఓ మహిళ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ప్రసారం చేయడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదుచేసిన పోలీసులు ఛానెల్ అధిపతి ఇషితా సింగ్, ఎడిటర్ అనుజ్ శుక్లాలను అరెస్ట్ చేశారు. వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసి సీఎం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశాడంటూ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రశాంత్ అరెస్టుపై ఆయన భార్య పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పౌరుల స్వేచ్ఛ పవిత్రమైందని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని, దాన్ని ఎవరూ ఉల్లంఘించలేరని కోర్టు స్పష్టం చేసింది. వెంటనే ప్రశాంత్ ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే జర్నలిస్టు ప్రశాంత్ అరెస్టుపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.



ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
11 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా