newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ ఎంపీ సీటుపై కాయ్ రాజా కాయ్

21-05-201921-05-2019 08:51:34 IST
Updated On 27-06-2019 13:33:53 ISTUpdated On 27-06-20192019-05-21T03:21:34.541Z21-05-2019 2019-05-21T03:18:53.253Z - 2019-06-27T08:03:53.593Z - 27-06-2019

ఆ ఎంపీ సీటుపై కాయ్ రాజా కాయ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీహార్ రాజ‌ధాని పాట్నా సాహెబ్ ఎంపీ సీటు మీద జోరుగా బెట్టింగ్ జ‌రుగుతోంద‌ట‌. ఈ సీటు నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ మీద బ‌రిలో దిగిన కాంగ్రెస్ అభ్య‌ర్థి శ‌త్రుఘ్న‌సిన్హాల మ‌ధ్య పోటాపోటీగా ప్ర‌చారం జ‌రిగింది. మొన్న‌టి దాకా ఇద్ద‌రి విజ‌యాల మీద భారీగా పందేలు జ‌రిగాయి. 

అయితే ఎగ్జిట్ పోల్ త‌ర్వాత చాలా మంది శ‌త్రుఘ్న‌సిన్హా కాసిన పందేన్ని న‌ష్టానికి వెన‌క్కి తీసుకున్నారట. మొత్తం డ‌బ్బులు న‌ష్ట‌పోయే బ‌దులు, కొద్దిగా న‌ష్ట‌పోవ‌డ‌మే బెట‌ర‌న్న ధోర‌ణికి వ‌చ్చార‌ట‌. ఎందుకంటే ఈ సీటు నుంచి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ విజ‌యం ఖాయ‌మ‌ని అన్ని స‌ర్వేలు తేల్చేశాయి. 

మొద‌టి నుంచీ బీజేపీకి ప‌ట్టున్న ఈ సీటులో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పాట్నా సాహెబ్ సీటు నుంచి పోటీ చేసి గెలిచిన శ‌త్రుఘ్న‌సిన్హా, ఈ ఎన్నిక‌ల్లో కూడా ఈ సీటు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే పార్టీ అధిష్టానం ఆయ‌న కోరిక‌ను తిర‌స్క‌రించ‌డంతో, బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఇక పాట్నా సాహెబ్ పార్లమెంట్ల సీటు ప‌రిధిలో ఎక్కువ శాతం కాయ‌స్థ కుల‌స్తులు ఉన్నారు. శత్రుఘ్న‌సిన్హా, ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ ఇద్ద‌రూ అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. మొన్న‌టి దాకా సిన్హాకు మ‌ద్ద‌తుగా ఉన్న ఇక్క‌డ ప్ర‌జ‌లు, ఆయ‌న తీరు మీద విసుగు చెందారట‌. ఎందుకంటే, తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌రిలో దిగిన శ‌త్రుఘ్న‌సిన్హా, యూపీలోని ల‌క్నో సీటు నుంచి త‌న భార్య పూన‌మ్ సిన్హాను స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్థిగా పోటీలో పెట్టారు.

అక్క‌డ ప్ర‌చారానికి వెళ్లిన ఆయ‌న‌, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టేశారు. ఇదే జ‌నానికి మండింది. ప్ర‌జాసేవ‌, పార్టీ మీద నిబ‌ద్ధ‌త క‌న్నా, సొంత ప్ర‌యోజ‌నాలే శ‌త్రుఘ్న‌సిన్హ‌కు ముఖ్య‌మ‌ని జ‌నం నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇదంతా ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఓట్ బ్యాంక్ రెట్టింపు చేసింద‌ట‌. ఇక బీజేపీ పెద్ద‌లు కూడా శ‌త్రుఘ్న‌సిన్హా మీద గుర్రుగానే ఉంది. 

2014 ఎన్నిక్లోల గెలిచిన త‌ర్వాత ఆయ‌న‌, ప్ర‌ధాని మోడీ ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు చేశారు. యూపీఏ ప‌క్షాలు ఏర్పాటు చేసిన స‌మావేశాల‌కు వెళ్లారు. వారి ముందే మోడీ మీద ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీంతో ఆయ‌న్ని పార్టీ నుంచి వ‌దిలించుకోడానికి బీజేపీ డిసైడ్ అంయింది. అందుకే సిన్హా పార్టీ మార అవ‌కాశం ఉంద‌ని తెల్సినా,  పాట్నా సాహెబ్ సీట్ ఇవ్వడానికి అమిత్ షా నిరాక‌రించిన‌ట్లు అర్థం అవుతోంది.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   15 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle