newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఆ అయిదు రాష్ట్రాలే కీలకం

23-05-201923-05-2019 08:35:40 IST
2019-05-23T03:05:40.207Z23-05-2019 2019-05-23T03:05:38.390Z - - 16-11-2019

ఆ అయిదు రాష్ట్రాలే కీలకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ విజయానికి కారణమయ్యే ఐదు హిందీ రాష్ట్రాల గురించే చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో హిందీ బెల్ట్‌లో పరాభవం తప్పదని ఆందోళన చెందుతున్న బీజేపీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బాసటగా నిలిచిన ఆ ఐదు రాష్ట్రాలు మళ్ళీ తమకే అనుకూలంగా ఉన్నట్లు ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించడంతో కమలనాధుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 185 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014లో వీటిలో 165 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావించిన ఆ పార్టీకి చుక్కెదురవుతోందని ఎగ్జిట్ ఫలితాలు పేర్కొన్నాయి.

ఇక 80 సీట్లు ఉన్న యూపీలో గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈ సారి మాత్రం 33 నుంచి 65 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని తెలిపాయి. పైగా ఈ ఐదు రాష్ట్రాలోని 185 సీట్లలో బీజేపీ 144 సీట్ల వరకూ గెలుపొందే అవకాశం ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరి వాస్తవిక ఫలితాలు ఎలా ఉంటాయో మరి కాసేపట్లో తేలిపోనుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle