newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఆశల పల్లకీలో సన్నీ డియోల్

22-05-201922-05-2019 07:39:12 IST
Updated On 27-06-2019 12:38:57 ISTUpdated On 27-06-20192019-05-22T02:09:12.089Z22-05-2019 2019-05-22T02:07:32.272Z - 2019-06-27T07:08:57.252Z - 27-06-2019

ఆశల పల్లకీలో సన్నీ డియోల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లోకి లేటుగా వ‌చ్చినా లేటెస్ట్ పాలిటిక్స్ చూపించార‌ట పంజాబ్ లోని గురుదాస్ పూర్ బీజేపీ అభ్యర్థి స‌న్నీ డియోల్. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌ని దాదాపుగా స‌ర్వేలు తేల్చేశాయ‌ట‌. ఆల‌స్యంగా టిక్కెట్ అందుకున్నా ఆయ‌న ప్రచారంలో దూసుకెళ్లారంటున్నారు. 

స్థానిక బీజేపీ శ్రేణుల‌తో పాటు సన్నీ అభిమానులు ప్రతి ర్యాలీలో పాల్గొన్నార‌ట‌. ముఖ్యంగా గ‌ద్ద‌ర్, బోర్డర్ వంటి దేశ‌భ‌క్తి సినిమాల‌తో జ‌నాన్ని ఉర్రూత‌లూగించారు స‌న్నీ దియోల్. ఇక ఆయ‌న పోటీ చేసిన గురుదాస్ పూర్ ఎంపీ సీటు కూడా పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో ఉండడంతో, జనం క్రేజ్ కూడా రెట్టింపు అయిందట‌. 

ఇక రాజ‌కీయాలు అంటే త‌న‌కు తెలియ‌ద‌న్న స‌న్నీ, దేశసేవ‌లో నిరంత‌రం ఉంటాన‌నీ, ప్రజాసేవ‌కుడిగా జీవితం సాగిస్తాన‌ని ప్రక‌టించారు. మ‌రో విష‌యం ఏంటంటే, పంజాబ్ ప్రజ‌ల‌కు ఇంకా బీజేపీ, అకాలీద‌ళ్ మీద కోపం త‌గ్గలేద‌ట‌. 

ఈ ప్రభావం స‌న్నీ మీద ప‌డ‌కుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు గురుదాస్ పూర్ బీజేపీ నేత‌లు. స‌న్నీ వాడిన రేంజ్ రోవ‌ర్ వాహ‌నానికి బీజేపీ జెండా క‌ట్టేలేద‌ట‌. స‌భ‌ల్లో కూడా ఎక్కడా మోడీ, అమిత్ షాల పేర్లు ప్ర‌స్తావించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. 

అంతేకాదు బీజేపీకి చెందిన కీల‌క నేత‌లు ఎవ్వరూ స‌న్నీకి మ‌ద్దతుగా ప్రచారం చేయ‌లేదు. కేవ‌లం సన్నీ డియోల్ కుటుంబానికి ఉన్న క్రేజ్, అభిమానుల బ‌లం మీదే స‌న్నీ ఆధార‌ప‌డిన‌ట్లు అర్థం అవుతోంది. ప్రచారంలో తెల్లచొక్కా, బ్లూ క‌ల‌ర్ జీన్స్ వేసుకున్న స‌న్నీ, మెడ‌లో కాషాయ కండువా కానీ, బీజేపీ కండువా కానీ క‌ప్పులేద‌ట‌. 

ఇక‌ పోస్టర్ల మీద‌ కూడా త‌న తండ్రి ధ‌ర్మేంద్ర, త‌ల్లి ప్రకాష్ కౌర్ ఫొటోల‌తో పాటు తాను గెలిస్తే ఏం చేస్తానో తెలిపే నినాదాలు మాత్రమే ముద్రించార‌ట‌. ఉగ్ర‌వాదం, మాద‌క ద్రవ్యాల‌తో న‌ష్టపోయిన పంజాబ్ యువ‌త‌ను ఆదుకుంటాన‌నీ, త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని స‌న్నీ ప్రతి స‌భ‌లో కోరారు. 

ఇక సన్నీ దియోల్ మీద కాంగ్రెస్ అభ్యర్థిగా బ‌రిలో ఉన్న సునీల్ జ‌క్కర్ ప్రచారంలో వెనుక‌బ‌టం కూడా ఆయ‌న‌కు క‌ల్సొస్తుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. మొత్తానికి మొద‌టిసారి రాజ‌కీయ రంగంలో అదృ‌ష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న స‌న్నీ డియోల్ గెల‌వాల‌ని ఆయ‌న అభిమానులు తెగ ఆరాట ప‌డుతున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే, స‌న్నీ దియోల్ స్టార్ డం ముందు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్ జ‌క్కర్ తేలిపోయార‌ట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle