ఆర్థిక సంవత్సరం పొడిగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
31-03-202031-03-2020 10:27:46 IST
Updated On 31-03-2020 10:51:08 ISTUpdated On 31-03-20202020-03-31T04:57:46.162Z31-03-2020 2020-03-31T04:57:38.331Z - 2020-03-31T05:21:08.884Z - 31-03-2020

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది కరోనా వైరస్. 200 దేశాలకు పాకింది కరోనా మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా 7,64, 866 లక్షల మందికి సోకింది కరోనా వైరస్. దీంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డెడ్‌లైన్‌ను జూన్ 30గా నిర్ణయించింది. జులై1తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాత్రి విడుదల చేసిన గెజిట్‌లో ఈ మేరకు పేర్కొంది. తాజా నిర్ణయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు ఉద్యోగులు, వేతన జీవులందరికీ ఊరట కలిగింది. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. వలస కార్మికులకు వెంటనే ఆశ్రయం కల్పించాలని కేంద్రం ఆదేశించింది. భారత్‌లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 1,347 కరోనా కేసులు నమోదు కావడంతో పాటు భారత్‌లో 43కు చేరింది కరోనా మృతుల సంఖ్య. సోమవారం ఒక్కరోజే భారత్‌లో 227 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ కారణంగా మూతబడిన ప్రైవేట్ పరిశ్రమలు తమ ఉద్యోగులను ఆరు నెలలపాటు అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు తొలగించేందుకు వీలులేకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగంలోని సిబ్బంది వేతనంలో 70 శాతం ప్రభుత్వమే మార్చి నుంచి మే వరకు చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సామాజిక సంక్షేమ రంగంలో ఉన్న సంస్థలను కోరారు. తప్పుడు వార్తలు, కథనాలను ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ విశ్వాసాల పేరుతో భౌతికంగా దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ప్రజలు గుంపులుగా గుమికూడుతున్నారని, దీనివల్ల కరోనా వైరస్ మరింత ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా