newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్థికమంత్రి లేకుండానే బడ్జెట్ భేటీ.. మోడీ తీరుపై కాంగ్రెస్ సెటైర్లు

10-01-202010-01-2020 08:53:40 IST
Updated On 10-01-2020 10:11:13 ISTUpdated On 10-01-20202020-01-10T03:23:40.228Z10-01-2020 2020-01-10T03:17:57.455Z - 2020-01-10T04:41:13.271Z - 10-01-2020

ఆర్థికమంత్రి లేకుండానే బడ్జెట్ భేటీ.. మోడీ తీరుపై కాంగ్రెస్ సెటైర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనవరి నెల వచ్చిందంటే చాలు కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్ కసరత్తు ప్రారంభమవుతుంది. వివిధ శాఖలతో సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనలో అటు మంత్రులు, ఇటు అధికారులు భేటీ అవుతారు. తాజాగా కేంద్ర బడ్జెట్ పై చర్చించేందుకు దేశంలోని ముఖ్య ఆర్థిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. బడ్జెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలపై వారితో చర్చించినట్టు సమాచారం.

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని ఆర్థిక వేత్తలను కోరారు. ఢిల్లీలోని నీతీ ఆయోగ్ కార్యాలయంలో 40 మంది ముఖ్య ఆర్థిక నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

2020-21 ఆర్థిక పద్దు కూర్పుపై జరిగిన ఈ సమావేశానికి… నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

అనుకున్న లక్ష్యాలు, సాధించిన పురోగతిపై చర్చించారు. కొత్త ఉద్యోగాల సృష్టి, జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల తదితర అంశాలపై సలహాలు, సూచనలను వారి నుంచి కోరారు. ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ రూపొందిస్తుండడంతో అన్నీవర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించనున్నారు. బడ్జెట్-2020పై సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ప్రజలనుంచి ఎలాంటి సూచనలు, సలహాలు, విమర్శలు వస్తాయో చూడాలి. 

Image may contain: 1 person, text

2019 ఏడాది జీడీపీ వృద్ధిరేటు భారీగా పడిపోవడంతో ఈసారి బడ్జెట్ పై కేంద్రం జాగ్రత్తలు పాటించనుంది. కార్పొరేటు ట్యాక్స్ తగ్గింపు, బ్యాంకుల విలీనం, తయారీ రంగానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఆర్థిక మందగమనం కొనసాగడం మోడీకి తలనొప్పిగా మారింది. కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పియూష్‌ గోయల్‌, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్‌ డెబ్రాయ్‌ కు కూడా ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

కీలకమయిన ఆర్థిక వేత్తల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లేకపోవడం చర్చనీయాంశం అయింది. అసలు ఆర్థికమంత్రి ఎందుకు హాజరుకాలేదనే దానిపై కాంగ్రెస్ విమర్శలు చేసింది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశంలో లేకపోవడంపై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. కీలకమైన సమావేశానికి ఆర్థికమంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆర్థికమంత్రి లేకుండా ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించడం దేనికి సంకేతం అని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ఎప్పటినుంచో విమర్శిస్తూనే వుంది. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   32 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle