ఆర్టికల్ 370 రద్దు పై ప్రజలలో ఆశ్చర్యంతో పాటు ఆనందం
06-08-201906-08-2019 14:31:30 IST
Updated On 06-08-2019 14:37:50 ISTUpdated On 06-08-20192019-08-06T09:01:30.276Z06-08-2019 2019-08-06T09:01:22.851Z - 2019-08-06T09:07:50.418Z - 06-08-2019

ఏడు దశాబ్దాల గాయానికి ఇప్పటికి మందు దొరికింది. కేంద్రం అత్యంత సాహసోపేతంగా కాశ్మీర్ పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ లో శాంతి కుసుమాలు విరిసేందుకు అవకాశం ఉందన్న భావనను దేశ ప్రజలలో కలిగించింది. కాశ్మీర్ పరిణామాలు యావద్దేశాన్నీ ఆశ్చర్యంలో ముంచెత్తినా, ఆర్టికల్ 370 రద్దు పట్ల ఆశ్యర్యంతో పాటు ఆనందం కూడా సామాన్యప్రజలలో వ్యక్తమౌతున్నది. కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల ఇప్పటికప్పుడు ఒనగూరే ప్రయోజనం ఏమిటన్నదాని కంటే దీర్ఘకాలంలో దేశంలో శాంతికి ముఖ్యంగా కాశ్మీర్ పురోభివృద్ధికీ ఎంతో దోహదపడుతుందన్న భావన అత్యధికుల్లో వ్యక్తమౌతున్నది.
కాశ్మీర్ కు ప్రాణాధారం లాంటి పర్యాటకం గత కొన్ని దశాబ్దాలుగా కుంటుపడింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ చర్యతో భవిష్యత్ లో ప్రపంచ పర్యాటకులను అమితంగా ఆకర్షించే కేంద్రంగా కాశ్మీర్ విలసిల్లుతుందన్నది నిస్సందేహం. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో ఉగ్రమూకల కదలికలు చాలా వరకూ తగ్గుతాయన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అది వాస్తవం కూడా. ముఖ్యంగా కాశ్మీరీలు ఇందు వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉగ్ర కల్లోలం వల్ల కాశ్మీర్ లో ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాలు దాదాపుగా మృగ్యంగా మారిపోయారి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి. అయితే ఆర్టికల్ 370 రద్దు అయిపోగానే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మీటగానే కోరుకున్న వన్నీ తెచ్చిచే భూతం ప్రత్యక్షమౌతుందన్నట్లుగా కాశ్మీర్ సమస్యలన్నీ రాత్రికి రాత్రి మాయమైపోయే మంత్రదండాన్ని తీసుకువచ్చినట్లు కాదు. ముఖ్యంగా ఇంత కాలం కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం అన్నది రాజకీయంగా కొన్ని పార్టీలకు మింగుడు పడని అంశం. ప్రత్యేక ప్రతిపత్తి అన్న ఒకే ఒక అంశాన్ని అడ్డుపెట్టుకుని దశాబ్దాలుగా అక్కడ కొందరు ఉగ్రవాదానికి దన్నుగా నిలిచారు. ఉగ్రవాదుల కోసం పని చేశారు. అందుకు వారికి ఉన్న పలుకుబడితో యువతను భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికీ వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. భారత సైన్యంపైకీ, భద్రతా బలగాలపైకీ రాళ్లు రువ్వడమన్నది కాశ్మీరీ యువతకు ఒక ఆదాయ మార్గంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతుంది. ఇప్పటికే కేంద్రం నుంచి అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయి. అంటే రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి చాలా ముందు నుంచే...అంటే పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయం నుంచే కేంద్రం కాశ్మీర్ పరిస్థితులపై ఒక అవగాహనకు, అక్కడ ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న శక్తులపై నిఘాకు అన్ని చర్యలూ తీసుకుంది. యథేచ్ఛగా ఉగ్రవాదుల కదలికల నియంత్రణకు అప్పుడే బీజం పడింది. అయితే సంకీర్ణంలోని విభేదాల కారణంగా పూర్తి స్థాయిలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు అవకాశం లేకుండా పోయింది. బుర్హన్ వని వంటి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ జరిగినప్పుడు స్థానికుల తిరుగుబాటు వెనుక ఉన్నది...కొన్ని రాజకీయ శక్తులూ, వేర్పాటు వాదులేనన్నది తెలిసినా...సంకీర్ణ ధర్మం కారణంగా ఆ బంధాన్ని బద్దలు కొట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సంకీర్ణం నుంచి వైదొలగిన బీజేపీ...అక్కడ గవర్నర్ పాలన రాగానే.. కాశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు కదిపింది. ఆ ఫలితమే ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు. వ్యూహాత్మకంగా రాజ్యసభలో బిల్లును ముందు ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవడం ద్వారా విపక్షాల దూకుడుకు చెక్ పెట్టగలిగింది. ఈ నిర్ణయంతో కాశ్మీర్ లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ముందుగానే బలగాలను మోహరించింది. కాశ్మీర్ లో పర్యటిస్తున్న బయటి వారిని వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో పాటు, అమర్ నాథ్ యాత్రను కుదించడం ద్వారా ఒక వేళ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైనా నష్టం అతి కనిష్టానికి తగ్గేందుకు వీలుగా పావులు కదిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి అనూహ్యంగా విపక్షాల నుంచీ కూడా మద్దతు రావడంతో ఇక కాశ్మీర్ లో శాంతికి బీజం పడినట్లేనని భావించవచ్చు.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
30 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా