newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

ఆర్టికల్ 370 రద్దుకు పార్టీలకు అతీతంగా మద్దతు దేనికి సంకేతం?

08-08-201908-08-2019 15:04:07 IST
2019-08-08T09:34:07.551Z08-08-2019 2019-08-08T09:34:03.141Z - - 22-11-2019

ఆర్టికల్ 370 రద్దుకు  పార్టీలకు అతీతంగా  మద్దతు దేనికి సంకేతం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు తరువాత కాశ్మీరీల్లో భవిష్యత్ పట్ల ఆశ చిగురిస్తున్నదని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాదులు, రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలూ ఆర్టికల్ 370 రద్దుతో బ్రహ్మాండం బద్దలైపోతుందనీ, కాశ్మీర్ రగిలిపోతుందని చేసిన ప్రకటనలు, హెచ్చరికలు దూదిపింజల్లా ఎగిరిపోయిన పరిస్థితి ప్రస్తుతం కాశ్మీర్ అంతటా కనిపిస్తున్నది. 

కేంద్రం కూడా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనీ, జనం తిరగబడతారన్న అంచనాతోనే రెండు మూడు రోజుల ముందునుంచే  జమ్మూకాశ్మీర్ కు భారీగా భద్రతా దళాలను తరలించింది. 144 సెక్షన్ విధించింది. వేర్పాటు వాద నేతలతో పాటు ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రానికి చెందిన పీడీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు  కాంగ్రెస్ సహా పలు బీజేపీ యేతర పార్టీల అగ్రనాయకులను నిర్బంధంలోనికి తీసుకుంద. అయితే ఆర్టికల్ 370 రద్దును పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించి, రాష్ట్రపతి ఉత్తర్వుతో చట్టంగా మారిన తరువాత కూడా జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగానే ఉంది. బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో చర్చ జరుగుతున్న రోజు వినా  ఆ తరువాత నుంచీ కాశ్మీర్ లో వ్యాపార వాణిజ్య సంస్థలు యథావిధిగా పని చేశాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం వల్ల కానీ లేకుంటే అవి కూడా మామూలుగానే పని చేసి ఉండేవని పరిశీలకులు చెబుతున్నారు. ఇంత కాలం ఉన్న స్వయం ప్రతిపత్తి రాష్ట్రానికి లేకుండా పోయిందన్న ఆవేదన సగటు కాశ్మీరీల్లో కనిపించడం లేదనీ, పైపెచ్చు ఇక ముందు రాష్ట్రంలో శాంతి విరాజిల్లుతుందన్న ఆశ లేశామాత్రంగానైనా వారిలో కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా గత రెండు రోజులుగా కాశ్మీర్ లో పరిస్థితిని గమనిస్తే కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్న సంగతి విస్పష్టంగా తెలుస్తున్నది. అంతర్జాలం అందుబాటులో లేకపోవడం వల్ల బయటి వారికి అక్కడ ఏం జరుగుతోందో అన్న ఆందోళన సహజంగానే ఉంటుంది. 

కాశ్మీర్ బయట ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన వారు అక్కడ తమ వారు ఎలా ఉన్నారన్న ఆందోళనకు గురి కావడం సహజమే. ఫోన్ సౌకర్యం,ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ పరిస్థితి భయానకంగా ఉందన్న భావనా సహజమే. కానీ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అక్కడి స్థానికులతో కలిసి ముచ్చటిస్తున్న దృశ్యాలూ, రోడ్డు పక్క హోటల్ లో తేనీరు సేవిస్తున్న దృశ్యాలూ చూస్తే ఆ ఆందోళనలు మటుమాయం అయిపోతాయి.  కాశ్మీర్ లో శాంతి కుసుమాలు విరిస్తే...దేశంలో శాంతి పరిఢవిల్లుతుందనడంలో సందేహం లేదు. మతం అన్న సున్నిత మైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం, ప్రయోజనం కోసం రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే శక్తులకే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కంటగింపుగా ఉందనడంలో సందేహం  లేదు. కాంగ్రెస్ ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..మరో పక్క అదే పార్టీకి చెందిన పలువురు నేతలు ఆర్టికల్ 370కి అనుకూలంగా ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆర్టికల్ 370 రద్దు వల్ల భవిష్యత్ లో మేలు జరుగుతుందన్న విశ్వాసమే దేశ వ్యాప్తంగా వ్యక్తమౌతున్నదన్నది వాస్తవం.

 ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం తరువాత ముస్లిం మహిళల్లో ఆనందం ఎలా వ్యక్తమైందో...ఆర్టికల్ 370 రద్దు తరువాత సగటు కాశ్మీరీల్లో కూడా అలాగే సంతోషం వెల్లి విరుస్తున్నది. అధికార పార్టీకి బలం లేని రాజ్యసభలో కూడా ఈ రెండు బిల్లులూ ఆమోదం పొందడమే...వీటి పట్ల జనానికి ఉన్న సానుకూలత అర్ధమౌతున్నది.  ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించదు. ఇప్పుడు కాంగ్రెస్ లోనైనా, మరో పార్టీలోనైనా ఆర్టికల్ 370పై గట్టిగా నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితి ఉండటానికి అదే కారణమని చెప్పవచ్చు. మోడీ నాయకత్వాన్ని, ఆయన విధానాలను వ్యతిరేకించి బీజేపీ  నుంచి బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సైతం బిజెపి నాయకత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చిన యశ్వంత్‌ సిన్హా  సైతం ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తూ...ఇదే పని మోడీ సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసి ఉంటే విపక్షాలకు ఈ పాటి స్థానాలు కూడా దక్కేవి కావని వ్యాఖ్యానించారంటేనే...బిల్లును సామాన్య జనం ఎంతగా స్వాగతిస్తున్నారో అర్ధమౌతుంది.   అంతెందుకు జ్యోతిరాదిత్య సింధియా వంటి కాంగ్రెస్ వాదులు సైతం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్న వెరుపు కూడా లేకుండా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడమంటే...ప్రజలు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉండటమే కారణం.  ఒక చారిత్రక తప్పిదాన్ని మోడీ 2.0 సర్కార్ సరిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్ధన్ ద్వివేదీ వంటి వారు బాహాటంగా ప్రకటిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle