newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆరో వేలు లాంటి గవర్నర్ వ్యవస్థ అవసరమా?

12-08-201912-08-2019 14:12:04 IST
Updated On 13-08-2019 12:30:45 ISTUpdated On 13-08-20192019-08-12T08:42:04.368Z12-08-2019 2019-08-12T08:41:57.817Z - 2019-08-13T07:00:45.732Z - 13-08-2019

ఆరో వేలు లాంటి గవర్నర్ వ్యవస్థ అవసరమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మోడీ 2.0 పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నది. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, జల వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్ వంటి అనేక నిర్ణయాలతో దేశ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నది. ఆ దిశలోనే దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న గవర్నర్ వ్యవస్థ కొనసాగాలా? వద్దా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా...గవర్నర్ సకల సౌకర్యాలు అనుభవించే అవకాశం ఉంది. 

అదే సమయంలో ఆయా రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మనుగడ అన్నది ఆయన విచక్షణపై ఆధారపడి ఉండే పరిస్థితి కూడా ఉంది. అంతే కాకుండా చాలా రాష్ట్రాలలో రాజ్ భవన్ లు(గవర్నర్ బంగ్లా) రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి. అంతే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల సీనియర్ నాయకులకు రాజకీయ పునరావాసంగా ఉంటున్నాయి. ఇది సమర్ధనీయమా? ఈ వ్యవస్థ వలన ప్రజలకు ఏమైనా మేలు జరుగుతున్నదా? అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం రాదు. పలు సందర్భాలలో రాష్ట్రాలలో గవర్నర్ లు ఆయా రాష్ట్రాలలో రాజకీయ అస్థిరతకు కారకులైన సందర్భాలు ఉన్నాయి.

ప్రజాప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేసిన పలు సందర్భాలను చూశాము.తాజాగా కర్నాటక, అంతకు ముందు జమ్మూ కాశ్మీర్...ఇంకా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి గవర్నర్ రామ్ లాల్ నిర్వాకం ఇవన్నీ గవర్నర్ వ్యవస్థ అవసరమా? అన్న చర్చకు తెరలేపాయి. ముందుగా కర్నాటక విషయమే తీసుకుంటే...సభా విశ్వాసం పొందగపలిగేంత బలం లేకపోయినా బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం నుంచి కర్నాటక గవర్నర్ తన విచక్షణను తన బాస్ ల( అంటే గవర్నర్ కాకపూర్వం తాను పని చేసిన పార్టీ పెద్దల) ఆకాంక్షలు, అభీష్టాలకు అనుగుణంగా వ్యవహరించారు. అందుకే కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత యెడియూరప్ప సభా విశ్వాసాన్ని పొందలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింద. 

సరే ఆ తరువాత కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువదీరింది. సరే అదీ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అయితే సభలో కుమారస్వామి విశ్వాస పరీక్షపై చర్చ సుదీర్ఘంగా కొనసాగుతున్న సమయంలో తన అధికార పరిధిని మీరి గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ కు, ముఖ్యమంత్రికి లేఖలు రాయడం, ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చస్తానని ఆ లేఖల్లో బెదరించడం ఏ విధంగా చూసినా గవర్నర్ వ్యవస్థకు గౌరవం కాదు. రాజ్ భవన్ లు ఆయా రాష్ట్రాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధ కార్యాలయాలుగా మారిపోయాన్న భావన ప్రజలలో వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో గవర్నర్ల వ్యవస్థలను తమ ప్రభుత్వాలు అధికారంలో లేని రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూల్చివేయడానికి కాంగ్రెస్ యథేచ్ఛగా వాడుకుని ఆ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చింది. ఇప్పుడు కూడా బీజేపీ దాదాపుగా అదే పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

కర్నాటకలో గవర్నర్ అత్యుత్సాహం ఇందుకు నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఊతం ఇచ్చే విధంగా వ్యవహరించిన అప్పటి గవర్నర్ రామ్ లాల్ తీరు పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా  గవర్నర్ తీరు వివాదాస్పదమైంది. ఫెడరల్ సమాఖ్య బలోపేతమయ్యే తీరులో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధాన కర్తలుగా, సమన్వయం కుదిరే విధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు తొత్తులుగా, వారి అడుగులకు మడుగులొత్తేందుకు పడుతున్న ఆత్రత గవర్నర్ వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయిందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

కర్నాటక, జమ్మూ కాశ్మీర్, గోవా, మేఘాలయల విషయంలో గవర్నర్ల తీరు వారి అధికార పరిమితులను దాటి వ్యవహరించారు. గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో కాంగ్రెస్ బాటలోనే బీజేపీ కూడా నడుస్తున్నదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీకి తాబేదార్లు, గులాములుగా వ్యవహరిస్తారన్న నమ్మకం ఉన్న వ్యక్తులే రాష్ట్రాలకు గవర్నర్ లుగా నియమితులౌతున్నారు. ఇటువంటి తీరు ప్రజాస్వామ్యానికి, ఫెడరల్ స్ఫూర్తికి ఎంత మాత్రం అనుగుణంగా లేదు. ఈ విషయంలో అంటే గవర్నర్ల వ్యవస్థ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle