newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆప్‌ని ఇరుకునపెడుతున్న రాహుల్ కామెంట్స్

14-05-201914-05-2019 07:43:53 IST
Updated On 28-06-2019 12:38:11 ISTUpdated On 28-06-20192019-05-14T02:13:53.357Z14-05-2019 2019-05-14T02:10:01.978Z - 2019-06-28T07:08:11.267Z - 28-06-2019

ఆప్‌ని ఇరుకునపెడుతున్న రాహుల్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెల్సి మాట్లాడుతున్నారో, తెలియ‌క మాట్లాడుతున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని ఢిల్లీ కాంగ్రెస్ నేత‌లు వాపోతున్నార‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌డానికి ఆమ్ ఆద్మీ పార్టీనే కార‌ణం అంటూ రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నిక‌ల ప్రచార స‌భ‌లో కామెంట్ చేశారు. 

యూపీఏ కుంభ‌కోణాల మీద స‌మాధానం చెప్పలేని ప‌రిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ నెపాన్ని ఆప్ మీద నెట్టేసింద‌నేది కాంగ్రెస్ శ్రేణుల భావ‌న‌. ఈ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే బీజేపీని ఓడిస్తుంద‌ని రాహుల్ అన‌డం కూడా విచిత్రంగా ఉంద‌నేది ఆ పార్టీ నేత‌లు అంటున్నారట‌. గెలిచే స‌త్తా ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఎందుకు ప్రయ‌త్నించార‌న్న ఆప్ నేత‌ల ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఎలా చెప్పాలో ఢిల్లీ కాంగ్రెస్ నేత‌ల‌కు అర్థం కావ‌డం లేద‌ట‌. 

ఇంత‌క‌న్నా మ‌రో విష‌యం కూడా ఢిల్లీ కాంగ్రెస్ నేత‌ల‌ను వెంటాడుతోంది. గ‌తంలో త‌మ పార్టీ చాలా త‌ప్పులు చేసిందంటూ రాహుల్ గాంధీ ఢిల్లీ ప్ర‌చార స‌భ‌లో చెప్పుకొచ్చారు. అంతేకాదు, త‌మ పార్టీ ఉద్దేశం ఎప్పుడూ మంచిగానే ఉంటుంద‌నీ, జ‌నం అర్ధం చేసుకోవ‌డంలోనే కొంచెం ఇబ్బందిగా మారింద‌న్నారు రాహుల్. ఇదే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ నేత‌ల‌కు త‌ల‌కొట్టేసిన‌ట్లు అయింద‌ట‌. ఏకంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు తాము గ‌తంలో త‌ప్పులు చేశామ‌ని ఒప్పుకోవ‌డం ఏంట‌ని వాపోతున్నారు. 

అంతేకాదు, జ‌నం అర్థం చేసుకోవ‌డంలో ఇబ్బంది అంటే, తాము జ‌నానికి స‌రిగ్గా అర్థం అయ్యేలా ప్రచారం చేయ‌డం లేద‌ని భావించాలా, పార్టీ పెద్దల తీరు స‌రిగ్గా లేద‌ని భావించాలా అన్నదే కాంగ్రెస్ కార్యక‌ర్తల‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింద‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే, చౌకీ దార్ చోర్ హై అన్న నినాదం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసులో వినిపించ‌ద‌నీ రాహుల్ గాంధీ చెప్పారు. 

ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఇబ్బందిగా మారింద‌ట‌. చౌకీ దార్ చోర్ హై అంటూ ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, ఆ త‌ర్వాత సుప్రీం కోర్టులో చివాట్లు తిన‌డం, క్షమించ‌ని వేడుకోవ‌డం జ‌నానికి బాగా తెలుసుననీ, అలాంట‌ప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసులో ఆ నినాదం వినిపించద‌ని రాహుల్ అన‌డం ఏంట‌ని ప్రశ్నిస్తున్నారు. అంటే త‌న మాదిరిగానే కేజ్రీవాల్ కూడా సుప్రీం కోర్టు క్షమాప‌ణ చెప్పాల‌న్నది రాహుల్ గాంధీ ఉద్దేశంగా భావించాలా అని కాంగ్రెస్ నేత‌ల‌ను ఎదురు ప్రశ్నిస్తున్నారు. 

ఈ రెండు కామెంట్ల మీద ఆప్ నేత‌లు జోకులు పేలుస్తుండ‌టం, త‌మ‌కు ప్రచారంలో ఇబ్బందిగా మారింద‌ని వాపోతున్నారు. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తుల కోసం ప్రాంతీయ పార్టీలు ఆశ‌ప‌డ‌టం సాధార‌ణ విష‌య‌మే.

ఇదే త‌ర‌హాలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కోసం ఉవ్విళ్లూరింది రాహుల్ గాంధీ. అయితే ఢిల్లీతో పాటు హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా పొత్తు కావాల‌ని కేజ్రీవాల్ కోర‌డంతో వెన‌క్కి త‌గ్గింది కూడా రాహుల్ గాంధీనే. 

ఇది అంద‌రికీ తెల్సిన రాజ‌కీయ‌మే. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మ‌ధ్య పొత్తు ఉంటే, బీజేపీ ఇబ్బంది ప‌డ‌టం ఖాయం. కానీ అలా జ‌ర‌గ‌క పోవ‌డంతో ఇప్పుడు త్రిముఖ పోరులో బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఇక పంజాబ్, హ‌ర్యానాలో కేజ్రీవాల్ పొత్తు కోర‌డంలో ఏమాత్రం తప్పు కాదు. అవ‌కాశాన్ని అంది పుచ్చుకోవాల‌న్నదే ఆయ‌న ఉద్దేశం. 

ఒక‌వేళ అలా జ‌రిగితే రెండు పార్టీల‌కూ లబ్ది చేకూరేదేమో. ఇదేమీ ఆలోచించ‌ని రాహుల్ గాంధీ, ఢిల్లీలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు కావాలంటూ యూట‌ర్న్ తీసుకుంద‌ని కామెంట్ చేయ‌డం కామెడీగా ఉంద‌నేది ఆ పార్టీ నేత‌లు అభిప్రాయప‌డుతున్నారట‌.

అంతేకాదు, న‌రేంద్ర మోడీ మ‌రోసారి ప్ర‌ధాని అయితే, అందుకు రాహుల్ గాంధీనే కార‌ణ‌మ‌న్న అర‌వింద్ కేజ్రీవాల్ కామెంట్ వెనుక రాహుల్ గాంధీ తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న‌లే కార‌ణ‌మంటూ ఢిల్లీ కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఫీల‌వుతున్నార‌ట‌.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle