newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆదిత్య అంద‌లం ఎక్కుతారా..?

05-10-201905-10-2019 17:46:26 IST
2019-10-05T12:16:26.818Z05-10-2019 2019-10-05T12:16:19.990Z - - 17-04-2021

ఆదిత్య అంద‌లం ఎక్కుతారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా ఆదిత్య థాక్రే పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మొద‌టిసారి థాక్రే కుటుంబం నుంచి ఆదిత్య థాక్రే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డుతుండ‌టంతో పాటు ఆయ‌నే కాబోయే ముఖ్య‌మంత్రి అంటూ శివ‌సేన పార్టీ నేత‌లు చెబుతుండ‌టంతో మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల చూపు 29 ఏళ్ల ఆధిత్యపై ప‌డింది.

వొర్లి అసెంబ్లీ స్థానం నుంచి ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. 1966లో బాల్ థాక్రే శివ‌సేన పార్టీని స్థాపించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న కానీ, ఆయ‌న కుటుంబం నుంచి కానీ ఎవ‌రూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఎటువంటి రాజ్యాంగ ప‌ద‌విలో థాక్రే కుటుంబం లేదు.

అయితే, మొద‌టిసారి శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య థాక్రేను ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిపారు. ఇప్ప‌టికే పార్టీ యువ‌జ‌న విభాగం(యువ‌సేన) అధ్య‌క్షుడిగా ఉద్ధ‌వ్ ఉన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిపించినందుకు గానూ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు ఆయ‌న జ‌న్ ఆశీర్వాద్ యాత్ర నిర్వ‌హించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు.

దీంతో అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఆదిత్య‌ను శివ‌సేన ఎన్నిక‌ల బ‌రిలో నిలిపింది. ఇందుకు గానూ సేఫ్ సీట్‌గా భావించి శివ‌సేన‌కు గ‌ట్టి ప‌ట్టున్న వొర్లి స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు.

ఆయ‌న ఇక్క‌డ నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. మ‌రాఠీ ప్ర‌జ‌ల‌నే కాకుండా నియోజ‌క‌వ‌ర్గంలో స్థిర‌ప‌డ్డ గుజ‌రాతీ, తెలుగు, త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు, ముస్లింల‌ను ఆక‌ట్టుకునేలా ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. ఆయా భాష‌ల్లో ఆయ‌న ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న గెలుపు ఇక్క‌డ పెద్ద‌గా క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు.

అయితే, ఆదిత్య కేవ‌లం ఎమ్మెల్యేతో ఆగిపోర‌ని ముఖ్య‌మంత్రి అవుతార‌ని శివ‌సేన నేత‌లు చెబుతున్నారు. చంద్ర‌యాన్ సాంకేతిక కార‌ణాల‌తో చంద్రుడిపై ల్యాండ్ అవ్వ‌లేకపోయింద‌ని, కానీ త‌మ సూర్య‌యాన్‌(ఆదిత్య‌) మాత్రం మంత్రాల‌య ఆరో అంత‌స్థులో(మ‌హారాష్ట్ర స‌చివాల‌యంలోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం) ల్యాండ్ అవుతుంద‌ని శివ‌సేన ముఖ్య‌నేత సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు.

అయితే, ఇది అంత సులువుగా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి శివ‌సేన పెద్ద‌న్న‌లా ఉండేది. బాల్ థాక్రే ఉన్న‌ప్పుడు శివ‌సేన చెప్పిన‌ట్లే బీజేపీ న‌డుచుకునేది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.

గ‌త ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయ‌గా బీజేపీ 122 సీట్లు గెలుచుకోగా, శివ‌సేన కేవ‌లం 63 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. దీంతో ఎన్నిక‌ల త‌ర్వాత రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ నుంచి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఈసారి కూడా ఫ‌డ్న‌వీస్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని బీజేపీ చెబుతోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీజేపీ 150 సీట్ల‌లో, శివ‌సేన 124 సీట్ల‌లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించాయి. దీంతో ఆధిత్య ముఖ్య‌మంత్రి కావాలంటే 150 సీట్ల‌లో బీజేపీ గెలిచే సీట్ల కంటే 124 సీట్ల‌లో శివ‌సేన ఎక్కువ సీట్లు గెల‌వాల్సి ఉంటుంది. అలా అయితేనే బీజేపీ ముందు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి త‌మ‌కు కావాల‌నే డిమాండ్‌ను శివ‌సేన పెట్టే అవ‌కాశం ఉంటుంది.

అయితే, ఆదిత్య థాక్రే మాత్రం త్వ‌ర‌లోనే శివ‌సేన నేత‌ను ముఖ్య‌మంత్రిగా చూస్తార‌ని ప్ర‌క‌టించారు. ఉద్ధ‌వ్ థాక్రే కూడా శివ‌సైనికుడిని(శివ‌సేన నేతను) ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో కూర్చోబెడ‌తాన‌ని త‌న తండ్రికి ఇచ్చిన మాట‌ను ఈ ఎన్నిక‌ల్లో నిల‌బెట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   8 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle