newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

21-09-202021-09-2020 18:25:35 IST
Updated On 21-09-2020 18:36:28 ISTUpdated On 21-09-20202020-09-21T12:55:35.095Z21-09-2020 2020-09-21T12:55:32.278Z - 2020-09-21T13:06:28.117Z - 21-09-2020

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకోగలగిన సర్కార్  బిల్లు వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై సరైన వివరణ ఇవ్వడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. బుల్ డోజ్ చేసిన విధంగా బిల్లులను అసెంబ్లీలో పాస్ చేయించిన కేంద్రం వాటిపై సమగ్ర చర్చకు ఇసుమంతైనా అవకాశం ఇవ్వలేదు. బిల్లుల విషయంలో రైతు ప్రయోజనాలపై అపేక్ష కంటే...రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న ఆత్రమే కేంద్రానికి అధికంగా ఉన్నదన్న సంగతి విదితమైంది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఒక కేబినెట్‌ మంత్రి రాజీనామా చేయడమే బిల్లుల విషయంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించలేదన్నది విదితమౌతున్నది.

జీఎస్టీ విషయంలో రాష్ట్రాలను ఎలా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందో...ఇప్పుడు ఆగ్రో బిల్లుతో కూడా రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నది. అంతే కాకుండా మార్కెట్ సెస్ ల ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి కూడా కేంద్రం గండికొట్టనున్నది. రాష్ట్రాల ఆర్థిక మార్గాలను మూసివేసి...అవి కేంద్రంపై అన్నిటికీ  ఆధారపడేలా చేయాలన్న కుట్ర కేంద్రం పన్నిందన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. అలా చేయడం ద్వారా రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రజల ముందు అసమర్ధ ప్రభుత్వాలుగా నిలబెట్టాలన్నది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ అనడంలోనూ, కమ్యూనిస్టులు సిద్ధాంతాలు దేశానికి అవసరం లేదని పదే పదే చెబుతున్న కేంద్రం పెద్దల మాటల్లోని అర్ధం ఇదే. 

దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలే కొలువుదీరాలన్న ఒక ప్రణాళికతో, వ్యూహాత్మకంగా రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ మూడు బిల్లులలోని నిర్ణయాలను కేందప్రభుత్వం ఇంతకు ముందే ఆర్డినెన్స్‌లుగా జారీచేసింది. వాటిపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. భాగస్వామ్య పక్షాలే తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకే సాగింది. ఈ బిల్లు వల్ల ప్రయోజనం అంటూ ఎవరికైనా ఉందా అన్నప్రశ్నకు పేద రైతులు కుదేలవ్వడం వినా మరో ప్రయోజనం లేదు. మద్దతుధర అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. మార్కెట్ సెస్సుల ఉండవు...కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ మార్గానికి గండి పడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో రైతులకు ప్రయోజనం కలిగేలా ధరను నిర్ణయించడం, డిమాండ్ లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడ వంటి చర్యలకు అవకాశం ఉండదు. రైతులకూ ప్రయోజనం లేక, రాష్ట్రాలకూ ఇష్టం ప్రయోజనం లేకుండా ఉన్న అగ్రో బిల్లుల వల్ల ప్రయోజనం పొందేవారెవరరైనా ఉన్నారా? అంటే ఉన్నారు.  వారు బడా భూస్వాములు. బడా వ్యాపారులూ మాత్రమే. ఈ బిల్లులను తీసుకురావడం ద్వారా మోడీ సర్కార్ తమది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదనీ, సూటూ బూటూ ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకుంది.  

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   22 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle