newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

18-11-201918-11-2019 13:13:45 IST
2019-11-18T07:43:45.545Z18-11-2019 2019-11-18T07:43:40.813Z - - 20-04-2021

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో కొన్ని నగరాల పేర్లు గతంలో మారాయి. కానీ తాజాగా ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టాక మరికొన్ని నగరాలకు కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా ఆ జాబితాలోకి తాజ్ మహల్ ఉన్న ఆగ్రా నగరం  కూడా చేరబోతోంది. దీనికోసం డాక్టర్ భీంరావ్ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఆగ్రా పేరు మార్పుపై ప్రయత్నాలు ప్రారంభించింది. ఆగ్రాకు 'అగ్రవాన్‌' అని పేరు మార్చనున్నారు. 

పవిత్రమైన కుంభమేళా జరిగే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు యోగి. అలాగే గుర్ గావ్ ప్రాంతాన్ని గురుగ్రామ్‌గా, ఫైజా బాద్ పేరును అయోధ్యగా మార్చారు. ఆయన సీఎంగా అయ్యాకే కాదు, అంతకుముందునుంచే ఆయన వివిధ ప్రాంతాల పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నారు.

గోరఖ్‌ఫూర్ ఎంపీగా ఉన్న కాలంలో అక్కడ మియా బజార్‌ను మాయా బజార్‌గా, హుమయూన్‌పూర్‌ను హునుమాన్‌పూర్‌గా మార్చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హైదరాబాద్ లో గత ఏడాది ఎన్నికల ప్రచారంలోనూ యోగి రెండు కొత్త పేర్లను తెరమీదకు తెచ్చారు. కరీంనగర్ పేరును కరీపురం, హైదరాబాద్‌ పేరును భాగ్యనగరం అని మారుస్తామన్నారు. దీనిపై కూడా వ్యతిరేకత వచ్చింది. 

బీజేపీ ఆధ్వర్యంలో మోడీ ప్రధాని అయ్యాక ఇప్పటివరకూ 25నగరాలు, గ్రామాలకు పేర్లు మార్చారు. పశ్చిమ బంగా పేరును బంగ్లాగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని వీలర్ ఐస్ లాండ్ ను డా.అబ్దుల్ కలాం ఐస్ లాండ్ గా, కేరళలలోని అరిక్కోడ్ ను అరీకోడెగా, హరియాణాలోని పిండారి పందు-పిండారాగా, నాగాలాండ్ లోని షామ్ పుర ను షాన్ పురెగా మార్చారు.

గుజరాత్ లో అహ్మదాపేరును కర్ణవతిగా మారుస్తామని సీఎం విజయ్ రుపాణి ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల పేర్లు గతంలో మార్చిన సంగతి తెలిసిందే. 1995లో బాంబే పేరును ముంబయిగా, 1996లో మద్రాస్ పేరును చెన్నైగా, 2001 లో కలకత్తా పేరును కోల్ కతాగా, 2011లో ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చారు. బెంగుళూరుని బెంగళూరుగా మార్పు చేశారు. 

ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. అంబేద్కర్‌ వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు. తాజ్‌నగర్‌కు మొదట్లో అగ్రవాన్‌ అనే పేరు ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

మహాభారత కాలంలో ఆగ్రా నగరాన్ని అగ్రవాన్‌, అగ్రబాణ్‌ అని పిలిచేవారంటున్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను వెలికితీస్తున్నట్లు ప్రొఫెసర్‌ సుగమ్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ పేర్ల మార్పు వల్ల ఏం జరుగుతుందో నేతలకే తెలియాలి. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle