ఆగస్టు 3 లేదా 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ.. మోదీకి ఆహ్వానం
19-07-202019-07-2020 07:07:02 IST
Updated On 19-07-2020 11:02:36 ISTUpdated On 19-07-20202020-07-19T01:37:02.699Z19-07-2020 2020-07-19T01:36:59.829Z - 2020-07-19T05:32:36.744Z - 19-07-2020

హిందువులు అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తున్న అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం జూలై 29న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం ఆగస్ట్ 5న దివ్యమైన ముహూర్తం ఉందని అదే రోజున శంకుస్థాపన చేసి తీరాల్సిందేనని సంకల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల ఈ కీలక ఘట్టాన్ని జరిపించాలని రామాలయ పెద్దలు నిర్ణయించారు. మోదీకి త్వరలోనే ఆహ్వానాన్ని సైతం పంపనున్నారు. కాగా ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య రామమందిర భూ వివాదానికి గత ఏడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా.. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం కొంత వెసులుబాటు కల్పించడం నెల రోజులుగా భూమిని చదును చేసే పనులు చేపడుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో నెల రోజుల్లోనే కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. రామమందిరం శంకుస్థాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం అయోధ్య అయోధ్యలో భవ్య రామ మందిరం శంకుస్థాపనకు విచ్చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శనివారం ఆహ్వానించింది. రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 3 లేదా 5వ తేదీన పునాది రాయి వేయనున్నట్లు ట్రస్టు అధికార ప్రతినిధి మహంత్ కమల్నయన్ దాస్, అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ వెల్లడించారు. నక్షత్రాలు, గ్రహాల కదలికల ఆధారంగా రెండు తేదీలను శుభ ముహూర్తాలుగా నిర్ణయించామని తెలిపారు. వీటిలో ఏదో ఒక తేదీన రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రామమందిర నిర్మాణం కోసం దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. డిజైన్ ఖరారైన తర్వాత మూడు నుంచి మూడున్నరేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కొందరు మంత్రులు, ఎంపీలు కూడా భూమి పూజకు హాజరవుతారని సమాచారం. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ అధిపతి మోహన్ భాగవత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మహంత్ దాస్ మీడియాతో మాట్లాడుతూ భూమి పూజా కార్యక్రమాన్ని వీడియో కాన్పరెన్సు ద్వారా లేక మరే ఇతర వర్చువల్ మార్గంలో నిర్వహించబోమని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అయోధ్యకు విచ్చేసి రామాలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మార్చి నెలలోనే ప్రారంభం కావలసిన భూమి పూజా కార్యక్రమం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా నిరవధికంగా నిలిపివేయబడింది.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
11 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా