newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆగని ‘పౌర’ ఆందోళనలు.. రాజస్థాన్లో సీఎం భారీ ర్యాలీ

23-12-201923-12-2019 08:34:58 IST
2019-12-23T03:04:58.787Z23-12-2019 2019-12-23T03:04:53.340Z - - 10-04-2021

ఆగని ‘పౌర’ ఆందోళనలు.. రాజస్థాన్లో సీఎం భారీ ర్యాలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టం అగ్గి రాజేస్తూనే వుంది. సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు  కొనసాగుతూనే వున్నాయి. సీఏఏని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటుండగా... జస్థాన్‌లో సీఎం గెహ్లాట్‌ సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది. అసోంలో 800 కి.మీ. పాదయాత్రకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. మహారాష్ట్ర, కర్ణాటకలో సీఏఏ అనుకూల ర్యాలీలు నిర్వహించారు. 

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారు. జైపూర్లో సుమారు 3 లక్షల మంది  సంవిధాన్‌ బచావో ర్యాలీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ, సమాజ్‌వాదీపార్టీ, ఆర్‌ఎల్డీ, జేడీఎస్‌కు చెందిన కార్యకర్తలు, మైనార్టీ వర్గ ప్రజలు, యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సభలో సీఎం గెహ్లాట్‌ మాట్లాడుతూ.. బీజేపీ, ఆరెస్సెస్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్‌ను హిందుత్వ దేశంగా మార్చడమే వారి ఎజెండా అని మండిపడ్డారు. 

Image

దేశ రాజధానిలో పలు చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు హిందూ-ముస్లిం రంగు పులిమారని, తమ గొంతుకను విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు.

మణిపూర్‌లోని దక్షిణ ఇంఫాల్‌లో అక్కడి ప్రభుత్వం రెండు నెలలపాటు నిషేధాజ్ఞలు విధించింది. భారీ మెజార్టీ ఉన్నందున చట్టాలు చేయొచ్చేమో కానీ ప్రజల మనసులు మాత్రం గెలువలేరని ఆందోళనకారులు పేర్కొన్నారు. ముంబైలోని ధారవి, మాల్వాణీ ప్రాంతంలో సీఏఏకి వ్యతిరేకంగా వేలాదిమంది మార్చ్‌ నిర్వహించారు. 

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సీఏఏకి వ్యతిరేకంగా ఇస్లామిక్‌ సంస్థలు, సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఇస్లామిక్‌ సంస్థల హస్తమున్నదని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోపించింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం 17కు చేరుకుంది.

ఇప్పటివరకు 879 మందిని అరెస్ట్‌చేశామని, ముందస్తు జాగ్రత్త చర్యగా 5,312 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. కర్నాటకలో సీఏఏకి వ్యతిరేకంగా ఈనెల 19న మంగళూరులో చోటుచేసుకున్న హింసలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.దక్షిణ ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జంతర్‌మంతర్‌ వద్ద ఎల్‌జీబీటీ కమ్యూనిటీ సభ్యులు ఆందోళన నిర్వహించారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle