newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆగని పౌరసత్వ ఆందోళనలు.. అరెస్ట్‌లు

30-12-201930-12-2019 08:30:48 IST
Updated On 30-12-2019 11:26:08 ISTUpdated On 30-12-20192019-12-30T03:00:48.162Z30-12-2019 2019-12-30T03:00:06.354Z - 2019-12-30T05:56:08.195Z - 30-12-2019

ఆగని పౌరసత్వ ఆందోళనలు.. అరెస్ట్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఈచట్టాన్ని నిరసిస్తూ చెన్నైలో కొందరు ఆందోళనకారులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైనా, ఇంటి ముందర ముగ్గులు వేశారు. వాటిలో సీఏఏకీ వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఆ ముగ్గుల్లో పేర్కొన్నారు. వీరి ముగ్గుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొంటూ పోలీసులు నలుగురు మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకోవడంతో నిరసన వ్యక్తం అవుతోంది.

అరెస్టయిన నలుగురు మహిళలను విడిపించడానికి ప్రయత్నించిన ఇద్దరు లాయర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారంటూ మహిళా నిరసనకారులను అరెస్టు చేశామని చెన్నై అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.

నిరసన తెలపడానికి వాళ్లు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.  చెన్నై పోలీసుల అనుమతి లేనందువల్లే అరెస్టు చేశామన్నారు. వినూత్న పద్దతిలో నిరసన తెలిపిన వారికి తన మద్దతు ఉందని నటి రీచా చద్దా ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.

Image

ఇదిలావుంటే.. కర్నాటకలో సీఏఏ ఆందోళనలు మిన్నంటాయి. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. మాట ఇచ్చిన 48 గంటల లోపే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది.

ఈ సందర్బంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది మాట్లాడారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.  ఇది మానవతా సాయం మాత్రమేనని, ఇందులో రాజకీయాలేమీ లేవు. ఇక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం వంటిదే. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారని ఆయన అన్నారు. యూపీలో నిరసనలు మిన్నంటాయి. 

యూపీలో కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీని లక్నో పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్ దిగి ఆమె మాజీ ఐపీఎస్ అధికారి దారాపురి ద్విచక్రవాహనంపై అక్కడినించి వెళ్లిపోయారు. సీసీటీవీ ఆధారంగా దారాపురికి హెల్మెట్ లేదని జరిమానా విధించారు.

Penalty For Former IPS O Darapuri Not Helmet With Priyanka Gandhi - Sakshi

లక్నో ట్రాఫిక్ పోలీస్ అధికారి 6100 రూపాయల జరిమానా వేశారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ప్రియాంక అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రియాంక తెగువను ఆమె భర్త రాబర్ట్ వాద్రా కొనియాడారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle