newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆగని ఆందోళనలు.. యూపీలో ఆరుగురి మృతి

21-12-201921-12-2019 08:19:28 IST
2019-12-21T02:49:28.020Z21-12-2019 2019-12-21T02:49:10.236Z - - 10-04-2021

ఆగని ఆందోళనలు.. యూపీలో ఆరుగురి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోడీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఆందోళనకారులు రాళ్ళు విసరడం, నిరసన ర్యాలీలు చేపట్టడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. శుక్రవారం యూపీలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. యూపీలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పౌరులు మరణించారు.

దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై జరిగిన ఆందోళన కారణంగా ఇప్పటి వరకు యూపీలో ఏడుగురు మరణించారని పోలీసులు తెలిపారు. 

యూపీ డీజీపీ ఆందోళనలపై మాట్లాడారు. తాము ఒక్క బుల్లెట్‌ ఉపయోగించలేదన్నారు. బిజ్నోర్‌లో ఇద్దరు, సంభాల్‌, ఫిరోజాబాద్‌, మీరట్‌, కాన్పూర్‌లో ఒక్కరేసి ఆందోళనకారులు మరణించారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రవ్వుతూ.. దాడులకు పాల్పడ్డారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు 144 సెక్షన్‌ విధించారు. 

సీఏఏపై మమతా బెనర్జీ తీరుని ఆ రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె వైఖరి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. దేశ అంతర్గత విషయాల్లో బయటి సంస్థల జోక్యాన్ని స్వాగతించడం ద్వారా మమతా బెనర్జీ రాజ్యాంగ విరుద్ధమైన వైఖరి ప్రదర్శించారని మండిపడ్డారు.

Image

సీఏఏపై, ఎన్నార్సీపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ చట్టంలో పొందుపర్చిన పౌరసత్వం నిబంధనలపై కేంద్రం  వివరణ ఇచ్చింది. జూలై 1, 1987న లేదా ఆ లోపు భారత్‌లో జన్మించిన వారు సహజంగానే భారతీయ పౌరులవుతారని తెలిపింది. అలాగే, ఆ తేదీ(జూలై 1, 1987)లోపు వారి తల్లిదండ్రులు భారత్‌లో జన్మించినట్లైనా కానీ ఆ పిల్లలు చట్టప్రకారం భారతీయ పౌరులవుతారని కేంద్రం పేర్కొంది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle