newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆక్స్‌ఫోర్డ్ వ్యాక్సిన్ త‌యార‌య్యేది పూణేలోనే..! ధ‌ర వెయ్యి లోపేన‌ట‌..!

23-07-202023-07-2020 08:05:46 IST
Updated On 23-07-2020 09:01:35 ISTUpdated On 23-07-20202020-07-23T02:35:46.644Z23-07-2020 2020-07-23T02:34:55.246Z - 2020-07-23T03:31:35.494Z - 23-07-2020

ఆక్స్‌ఫోర్డ్ వ్యాక్సిన్ త‌యార‌య్యేది పూణేలోనే..! ధ‌ర వెయ్యి లోపేన‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డలాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుకట్ట వేసే బ్ర‌హ్మాస్త్రం వ్యాక్సిన్ మాత్ర‌మేన‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బ్ర‌హ్మాస్త్రం త‌యారీలో ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ఒక అడుగు ముందుకేసింది. త్వ‌ర‌లోనే వైర‌స్ వ‌స్తుంద‌నే ధీమాను ప్ర‌పంచానికి అందించింది. ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలోని జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్ జ‌న‌వ‌రి నుంచే క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే ప‌రిశోధ‌న‌లు ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప‌రిశోధ‌న‌లు కొలిక్కివచ్చి వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. ప్ర‌స్తుతం ఈ వ్యాక్సిన్ మొద‌టి, రెండు ద‌శ‌ల‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి.

సీహెచ్ఏడీఓఎక్స్ ఎన్‌కోవ్ - 19 అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను త‌యారు చేశారు. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ త‌ర్వాత ఈ వ్యాక్సిన్ వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వ‌ని తేలింది. ఈ వ్యాక్సిన్ ద్వారా శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెంచే యాంటీబాడీలు, టీ సెల్స్ పెరిగిన‌ట్లు తేలింది. ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీతో క‌లిసి ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ఈ వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాదిలోనే ఆక్స్‌ఫోర్డ్ వ్యాక్సిన్ ప్ర‌జ‌లకు అందుబాటులోకి రానుంది.

అయితే, బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ, స్వీడ‌న్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో త‌యారు చేయాల‌నే ఆలోచ‌న‌లు సాగుతున్నాయి. ఇందుకు గానూ ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌ఖ్యాత వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ‌ల్లో భార‌త్‌లోని పూణేకు చెందిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) కూడా ముఖ్య‌మైన‌ది. ఒకేసారి 2 కోట్ల డోసుల వ్యాక్సిన్ త‌యారు చేసేందుకు గానూ ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌పంచంలో ఎక్కువ వ్యాక్సిన్ డోసుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సంస్థ‌గా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కూడా పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి చేయ‌డానికి, ఎగుమ‌తి చేయ‌డానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది. ఈ వ్యాక్సిన్ విష‌య‌మై సీర‌మ్ సంస్థ సీఈఓ ఆద‌ర్ పూణావాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ ప్ర‌యోగాలు భార‌త్‌లోనూ చేప‌ట్టేందుకు వారం రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వానికి అనుమ‌తులు కోర‌తామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత మ‌న దేశంలో సుమారు వెయ్యి మంది వాలంటీర్ల‌పై ఈ వ్యాక్సిన్‌ను ప్ర‌యోగించ‌నున్నారు.

ఇదే స‌మ‌యంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి కూడా ప్రారంభించ‌బోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. వేగంగా ఉత్ప‌త్తి చేసి త్వ‌ర‌గా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వ్యాక్సిన్ ధ‌ర కూడా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. సుమారు రూ.1000 లోపే వ్యాక్సిన్ ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. కాబ‌ట్టి, ప్ర‌భుత్వాలు ఈ వ్యాక్సిన్‌ను పేద‌ల‌కు ఉచితంగా కూడా అందించే వీలుంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. వ్యాక్సిన్‌ను అందించ‌డంలో మ‌న దేశానికే తొలి ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పారు.

అంటే, ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్ర‌యోగాలు పూర్త‌యితే మొద‌టి విడ‌త‌లోనే భార‌తీయుల‌కు కూడా అందే అవ‌కాశం ఉంటుంది. అది కూడా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి రానుంది. మ‌రోవైపు దేశీయ ఫార్మా కంపెనీలు కూడా క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. భార‌త్ బ‌యోటెక్ త‌యారుచేసిన కోవాక్సిన్ ప్ర‌స్తుతం క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉంది.

ఇక‌, ర‌ష్యా కూడా వ్యాక్సిన్ త‌యారీ రేసులో స్పీడు మీదుంది. ఆ దేశంలోని సెచెనెవ్ యూనివ‌ర్సిటీ త‌యారుచేసిన వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. వ‌చ్చే నెల‌లోనే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తెస్తామ‌ని ర‌ష్యా చెబుతోంది. ఒకేసారి 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ త‌యారు చేసే ప్లాన్‌తో ఉన్నామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. క‌రోనా భ‌యంతో ఉన్న ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ఇవ‌న్నీ శుభ‌వార్త‌లే.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle