newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అసమర్థుడు.. పనికిరానోడు.. వెన్నుపోటుదారు.. పైలట్‌పై గెహ్లాట్ ఫైర్

21-07-202021-07-2020 16:37:52 IST
Updated On 21-07-2020 21:23:05 ISTUpdated On 21-07-20202020-07-21T11:07:52.246Z21-07-2020 2020-07-21T11:07:49.086Z - 2020-07-21T15:53:05.176Z - 21-07-2020

అసమర్థుడు.. పనికిరానోడు.. వెన్నుపోటుదారు.. పైలట్‌పై గెహ్లాట్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుగుబాటు నేత మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌పై రాజస్థానం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సోమవారం తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారు. తన ఒకప్పటి యువ సహచరుడు పైలట్‌ని నమ్మి అదిష్టానం అనేక అందలాలు ఎక్కించినప్పటికీ పైలట్‌ కాంగ్రెస్‌ పార్టీని వెన్నుపోటు పొడిచారని గహ్లోత్‌ ఆరోపించారు. ఒక పీసీసీ అధ్యక్షుడు పార్టీకి వెన్నుపోటు పొడవడం బాధాకరం. నా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఫలించదు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీనే అది దెబ్బతీస్తుంది అని గహ్లోత్‌ మండిపడ్డారు. 

తన ప్రభుత్వానికి ముప్పు తప్పిందని నమ్మకం పెరిగిన నేపథ్యంలో తిరుగుబాటు నేత, సచిన్‌ పైలట్‌పై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌  ‘అసమర్ధుడు, పనికిరాని వాడు’ అంటూ నోరు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా పైలట్‌ పార్టీ కోసం ఏమీ చేయలేదని హిందీలో ‘నాకారా, నికమ్మా’ అంటూ దూషణలకు దిగారు. అయినా, పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఏమీ మాట్లాడలేదని, పీసీసీ చీఫ్‌ను మార్చాలని కోరలేదని వివరించారు. 

‘నేనేమైనా కూరగాయాలు అమ్మడానికి వచ్చానా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి కావడానికే వచ్చాను అనేవాడు’ అంటూ పైలట్‌పై గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. ఎవరన్ని కుట్రలు పన్నినా సత్యమే గెలుస్తుందని, తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. సచిన్‌ పైలట్‌ పనికిరాడని తమకు తెలిసినా ఏడేళ్లుగా రాష్ట్ర పీసీసీ చీఫ్‌ను మార్చలేదని గహ్లోత్‌ పేర్కొన్నారు. 

చిన్న వయసులోనే సచిన్‌ పైలట్‌కి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టింది కానీ చరిత్రలో తొలిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రి తన సొంత ప్రభుత్వాన్నే కూలదోయాలని చూశాడు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రలో భాగమే. మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ ఇలాగే చేసింది అంటూ గెహ్లాట్ ఆరోపించారు.

సాధారణంగా బీజేపీ, బీజేపీ ప్రభుత్వాల తరఫున న్యాయస్థానాల్లో వాదించే ముకుల్‌ రోహత్గీ, హరీశ్‌ సాల్వేలు పైలట్‌ తరఫున హైకోర్టులో వాదించడాన్ని గహ్లోత్‌ ప్రస్తావించారు. వారి ఫీజు కోట్లలో ఉంటుందని, ఆ మొత్తాన్ని పైలట్‌ స్వయంగా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. కాగా, రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. మరోవైపు సచిన్‌ పైలట్‌ సహా 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

ఇక సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ వర్గంలోకి వస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరుగుబాటు నేత ఆఫర్‌ ఇచ్చారని ఆయన బాంబు పేల్చారు. అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలని కోరినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘పైలట్‌జీ నాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని అడిగారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. బీజేపీలో చేరడం నాకు ఇష్టం లేదని చెప్పాను’ అని వివరించారు. ఈ విషయాన్ని వెంటనే సీఎం గహ్లోత్‌ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. 

కాగా గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపణలపై పైలట్‌ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్‌పై పైలట్‌ పరువునష్టం దావా వేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మనేసర్‌ రిసార్ట్స్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని పైలట్‌ ఆరోపించారు. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   10 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   3 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle