newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అశ్రునయనాల మధ్య ముగిసిన ప్రణబ్ అంత్యక్రియలు

01-09-202001-09-2020 16:30:32 IST
Updated On 01-09-2020 17:27:50 ISTUpdated On 01-09-20202020-09-01T11:00:32.314Z01-09-2020 2020-09-01T11:00:28.231Z - 2020-09-01T11:57:50.729Z - 01-09-2020

అశ్రునయనాల మధ్య ముగిసిన ప్రణబ్ అంత్యక్రియలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో దాదాకు కన్నీటి వీడ్కోలు పలికారు అభిమానులు, ప్రజలు.. సైనిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఇక, ఆయన కరోనాబారినకూడా పడడంతో.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రణబ్ అంతిమయాత్ర, అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ.. ప్రణబ్ అంత్యక్రియలను నిర్వహించారు. గన్ క్యారేజ్ పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లోనే ప్రణబ్ అంతిమయాత్ర కొనసాగింది.

ఆయన మరణంపై ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జి ఎమోషనల్ అయ్యారు. మా కుటుంబానికి మా నాన్నే ధైర్యం. ఆయన మాకు కొండంత అండగా ఉండేవారు. ఇప్పుడు మేం ఆయనను కోల్పోయాం అని అభిజిత్ ముఖర్జి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మరణానికి కరోనా మహమ్మారి ప్రధాన కారణం కాదని, బ్రెయిన్ సర్జరీ కారణంగానే ఆయన కోలుకోలేకపోయారని అభిజిత్ చెప్పారు.

మరణానంతరం అంత్యక్రియల కోసం తన తండ్రిని స్వరాష్ట్రమైన పశ్చిమబెంగాల్‌కు తీసుకెళ్దామని భావించామన్నారు. కానీ కరోనా నిబంధనల కారణంగా అది సాధ్యపడలేదని అభిజిత్ ముఖర్జి అన్నారు.

మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యం కారణంగా గత నెల 10వ తేదీన ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప్రతిలో చేరారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయనకు సర్జరీ కూడా చేశారు. అనంతరం ప్రణబ్‌కు కరోనా పాజిటివ్ సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రణబ్ ఆరోగ్యపరిస్థితి క్రమంగా విషమంగా మారింది.. తీవ్రమయిన కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆగస్టు 31వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   18 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   11 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle