newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అవసరాలు తీరాలంటే అప్పులు తెచ్చుకోండి.. కేంద్రం సలహా

29-08-202029-08-2020 06:44:59 IST
Updated On 29-08-2020 08:27:05 ISTUpdated On 29-08-20202020-08-29T01:14:59.534Z29-08-2020 2020-08-29T01:14:56.382Z - 2020-08-29T02:57:05.433Z - 29-08-2020

అవసరాలు తీరాలంటే అప్పులు తెచ్చుకోండి.. కేంద్రం సలహా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 వల్ల జరిగిన నష్టాలను భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి లేదని సాక్షాత్తూ కేంద్ర అటార్నీ జనరల్ తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకోసం అప్పులు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చేసింది. జీఎస్టీలో రావలసిన వాటాను డిమాండ్ చేయడం కంటే తమ అవసరాలను తీర్చుకోవడానికి అప్పులు చేయడమే సరైన పరిష్కారమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పేసింది. కోవిడ్-19తో కునారిల్లిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో భేటీకి వెళితే కౌన్సిల్ సమావేశం ఆయా రాష్ట్రాలకు చేదు గుళికలు తినిపించింది.

కేంద్రప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలకు రెండు అవకాశాలను ముందుంచింది. జీఎస్టీ ఆదాయం ఆశించినంత రాకపోవడంతో రాష్ట్రాలు హేతుబద్ధమైన వడ్డీరేటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది రూ. 97,000 కోట్ల మేరకు అప్పులు చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఆర్బీఐతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రాలు అప్పులు తీసుకోవచ్చని లిక్కర్, సిగరెట్లు, శీతలపానీయాలు, ఆటోమొబైల్స్ వంటి విలాసవస్తువులపై అధిక పన్నులు విధించడం ద్వారా ఈ అప్పులకు చెల్లింపులు చేయవచ్చని కేంద్రం ఉచిత సలహా పడేసింది.

ఇక రెండో మార్గం ఏదంటే కేంద్ర బ్యాంకుతో సంప్రదింపుల అనంతరం ఈ ఏడాది రాష్ట్రాల వాటా అయిన రూ. 2.35 లక్షల కోట్ల అప్పులను చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో ప్రారంభమైన 41వ జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సమావేశం వ్యవహారంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నెన్నో ఆశలతో జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత సలహాలు మాత్రమే ఇచ్చి పంపడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వ్యవహారంపై మండిపడుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం అప్పులు చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరాలను తీర్చుకోవడానికి ఆచరణ సాధ్యమైన పరిష్కారం అప్పులు చేయడమేనని చెప్పినట్లు సమాచారం. కేంద్రం సలహాపై ఢిల్లీ, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అవసరానికి మించి సుంకాలను వసూలు చేసినపుడు, కేంద్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్లను భారత దేశ ఏకీకృత నిధికి బదిలీ చేసిందని, ఇప్పుడు నిధుల కొరత ఏర్పడినపుడు అప్పులు తెచ్చుకోవాలని రాష్ట్రాలకు చెప్తోందని, ఇది మంచి పరిణామం కాదని చెప్పినట్లు తెలుస్తోంది. కోవిడ్-19 వల్ల జరిగిన నష్టాలను భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదని అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. 

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle