newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

అవగాహన లేని ఎంపీలు.. నినాదాల హోరు

19-06-201919-06-2019 07:47:03 IST
Updated On 21-06-2019 15:14:21 ISTUpdated On 21-06-20192019-06-19T02:17:03.491Z19-06-2019 2019-06-19T02:16:47.352Z - 2019-06-21T09:44:21.224Z - 21-06-2019

అవగాహన లేని ఎంపీలు.. నినాదాల హోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గెలిచిన చాలా మంది ఎంపీల‌కు ప్ర‌మాణ స్వీకారానికి, బ‌హిరంగ స‌భ‌ల‌కు తేడా తెలియ‌కుండా పోయింది. ఎందుకంటే ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా చాలా మంది ఎంపీలు, పార్టీల‌కు అతీతంగా నినాదాలు చేశారు. నినాదాలు చేయ‌వ‌ద్ద‌ని పార్ల‌మెంట్ అధికారులు ప‌లుమార్లు చెప్పినా చాలా మంది ఎంపీలు ప‌ట్టించుకోలేదు. 

ముఖ్యంగా బీజేపీ నుంచి కొత్త‌గా గెలిచిన ఎంపీలు ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత భార‌త్ మాతా కీ జై అనీ, జై శ్రీరాం అనీ, వందేమాత‌రం అంటూ నినాదాలు చేశారు. అయితే వందేమాత‌రం అన‌డానికి ఇస్లాం ఒప్పుకోదన్న స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ షాఫిక‌ర్ రెహ‌మాన్ బార్క్ మీద బీజేపీ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బ‌ల్లల‌ను కొడుతూ క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

మ‌రో విష‌యం ఏంటంటే, స‌భ‌లో రాహుల్ గాంధీ మ‌రోసారి కామెడీ చేశార‌ు. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత రెండుసార్లు భార‌త్ మాతా కీ జై అంటూ బీజేపీ ఎంపీ అరుణ్ కుమార్ సాగ‌ర్ నినాదాలు చేశారు. దీంతో వ‌న్ మోర్ టైం అంటూ రాహుల్ గాంధీ జోక్ చేశారు. అంతేకాదు, బీజేపీ ఎంపీ అజ‌య్ కుమార్ కూడా ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో భార‌త్ మాతా కీ జై అన్నారు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ వ‌న్ మోర్ టైం అన్నారు. 

అయితే తన నినాదానికి మ‌ద్ద‌తుగా జై కొడితే తాను రెండుసార్లు అంటాన‌ని అజ‌య్ కుమార్ చెప్ప‌డంతో, రాహుల్ గాంధీ జై హింద్ అన్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ ఎంపీలు కూడా జై హింద్ అన్నారు. ఇక హైద‌రాబాద్ ఎంపీ జై భీమ్, జై మీమ్, త‌క్బీర్ అల్లా అక్బ‌ర్, జై హింద్ అన్న నినాదాల‌తో త‌న ప్ర‌మాణ స్వీకారాన్ని ముగించారు. 

ఇక డీఎంకే ఎంపీలు పెరియార్ రామ‌స్వామి, క‌ళింగ‌ర్, అంబేద్క‌ర్, గాంధీల‌ను పొగుడుతూ నినాదాలు చేసి, త‌మ ప్ర‌మాణ స్వీకారాన్ని ముగించారు. ఇక మ‌థుర ఎంపీ హేమ మాలిని కూడా రాహే రాధే అంటూ నినాదం చేశారు. మొత్తానికి ఈ పార్ల‌మెంట్ సెష‌న్ నినాదాల‌తో మొద‌లైంద‌న్న జోకులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle