అర్థరాత్రి హైడ్రామా.... మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
23-11-201923-11-2019 08:47:35 IST
Updated On 23-11-2019 08:47:31 ISTUpdated On 23-11-20192019-11-23T03:17:35.748Z23-11-2019 2019-11-23T03:11:31.928Z - 2019-11-23T03:17:31.044Z - 23-11-2019

శుక్రవారం అర్థరాత్రి మరాఠా రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. హైడ్రామా నడిచింది. మహారాష్ట్ర రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడంలేదు. తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలో రాత్రికి రాత్రే మారిపోయాయి పరిణామాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవిస్.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకోసం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నవేళ శివసేన కూటమికి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన కలలను బీజేపీ, ఎన్సీపీ భగ్నం చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడమే తరువాయి అనుకున్నారంతా. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. బద్ధశత్రువులు కలిసి పోయారు. బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. చకచకా జరిగిన ఈపరిణామాలను శివసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. శివసేన-ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారేసరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాజకీయాల్లో వ్యూహాలు ఎలా వుంటాయో ఈ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు, మూడురోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాల గురించి ఢిల్లీలో మోడీతో భేటీ అయ్యారు శరద్ పవార్. అప్పుడే ఈ కూటమికి నాంది పడిందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అమిత్ షా, నరేంద్ర మోదీ మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నారు. వీరిద్దరి ముందు శివసేన వ్యూహాలు బెడిసికొట్టాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనడానికి బీజేపీ-ఎన్సీపీ మైత్రి గొప్న ఉదాహరణ అనడంలో అతిశయోక్తిలేదు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా