newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అర్థరాత్రి హైడ్రామా నడుమ చిదంబరం అరెస్ట్

22-08-201922-08-2019 09:21:15 IST
Updated On 22-08-2019 15:21:46 ISTUpdated On 22-08-20192019-08-22T03:51:15.283Z22-08-2019 2019-08-22T03:50:08.745Z - 2019-08-22T09:51:46.069Z - 22-08-2019

అర్థరాత్రి హైడ్రామా నడుమ చిదంబరం అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థికశాఖ మాజీమంత్రి చిదంబరం బుధవారం రాత్రి అరెస్టయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసుకున్న వినతిని మంగళవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మొదలైన హైడ్రామా ఎన్నో మలుపులు తిరిగింది.

హైకోర్టు తీర్పుపై స్టే కోసం వేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. చిదంబరం పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నిర్ణయించినట్లు సిబల్‌కు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ తెలియజేశారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు, సుప్రీంలో పరిణామాల నేపథ్యంలో చిదంబరం కనిపించకుండా పోయారు.  చిదంబరం కోసం సీబీఐ, ఈడీ బృందాలు గాలిస్తుండగా..  బుధవారం రాత్రి కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కనిపించారు.

దీంతో రంగంలోకి దిగింది సీబీఐ. అయితే సీబీబ టీంలు వచ్చేలోపే చిదంబరం ప్రెస్ మీట్ ముగించుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన సీబీఐ టీంలు మళ్ళీ చిదంబరం ఇంటికి వెళ్లాయి. అప్పటికే చిదంబరం ఇంటి తలుపులు వేసుకున్నారు. 

చిదంబరం వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, న్యాయవాదులు అయిన కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ కూడా ఉన్నారు. కొద్ది నిమిషాలకు 30 మందితో కూడిన సీబీఐ బృందం అక్కడికి వచ్చింది. చిదంబరం ఉండే బంగ్లా తలుపును తట్టింది. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో ముగ్గురు అధికారులు 5 అడుగుల ప్రహరీ గోడను ఎక్కి దూకి, ఇంట్లోకి ప్రవేశించారు. 

సీబీఐ అధికారులు బంగ్లా వెనుక ద్వారం వద్దకు వెళ్లారు. వెలుపలికి వెళ్లే అన్ని మార్గాల వద్ద సిబ్బందిని మోహరించారు. అరెస్టుకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేశాక చిదంబరాన్ని అదుపులోకి తీసుకొని కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు.  కోర్టు వారెంటుతోనే చిదంబరంను అరెస్టు చేసినట్లు సీబీఐ  పేర్కొంది. చిదంబరం రాత్రి మొత్తం సీబీఐ అతిథి గృహంలోనే ఉంటారని అధికార వర్గాలు చెప్పాయి. 

          ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను.                     నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. నేను ఎక్కడికీ పారిపోలేదు -చిదంబరం

మరోవైపు తాజా పరిణామాలపై కాంగ్రెస్ మండిపడింది.  తాము ఎవరిపైన, ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నామన్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకోవడంలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఐఎన్‌ఎక్స్‌ మీడియాతోపాటు ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కాకుండా మరో నాలుగు వ్యాపార లావాదేవీలకు అక్రమంగా విదేశీ పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతులు మంజూరు చేయడంలో ఆయన పాత్ర ఉందని ఈడీ అనుమానిస్తోంది.

ఇందుకు ప్రతిగా అనేక డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మేర ముడుపులు అందినట్లు ఆరోపిస్తోంది. అక్రమంగా ఎఫ్‌ఐపీబీ అనుమతులకు బదులు చిదంబరం, ఆయన కుమారుడు కార్తి ముడుపులు అందుకున్న తర్వాత ఒకే డొల్ల కంపెనీలో రూ.300 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లను చేసినట్లు ఆధారాలు లభించాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. 

                   రాజకీయ దురుద్దేశాలతోనే ఇప్పుడు ఈ కేసును అడ్డం పెట్టుకుని నా తండ్రిని వేధిస్తున్నారు. – కార్తీ చిదంబరం


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle