అయ్యో రామా... అంత మాట అనేశారేంటి?
06-05-201906-05-2019 14:56:33 IST
Updated On 01-07-2019 15:00:51 ISTUpdated On 01-07-20192019-05-06T09:26:33.425Z06-05-2019 2019-05-06T09:26:21.439Z - 2019-07-01T09:30:51.954Z - 01-07-2019

ఈసారి మళ్ళీ మోడీనే అని బీజేపీ నేతలు ఢంకా కొట్టి మరీ చెబుతున్నారు. మోడీ నోట కూడా అదే మాట వినిపిస్తోంది. కానీ కొంతమంది బీజేపీనేతలు వాస్తవంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. మరో పదిహేనురోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఈనెల 19వ తేదీన ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీనేతలకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాంమాధవ్ వ్యాఖ్యానించారు. బీజేపీ క్లీన్ మెజార్టీకి కాస్త వెనుకబడే అవకాశం ఉందని.. అయితే ఎన్టీఏ మిత్ర పక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సొంతంగా 271 సీట్లు గెలుచుకోవడం కష్టమే.. కాని గెలిస్తే అంతకంటే ఆనందం లేదని ఆయన అన్నారు. ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో రాంమాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొన్ని ప్రాంతీయపార్టీలతో టచ్ లేమని చెబుతున్నారు. అయితే అదంతా బయటకు చెప్పలేమని, మా వ్యూహాలు మాకుంటాయంటున్నారు రాంమాధవ్. తెలుగురాష్ట్రాల్లో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల విషయం చెప్పకనే చెబుతున్నారు. బీజేపీతో కలిసి పనిచేద్దామని వచ్చే పార్టీలకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయంటున్నారు రాం మాధవ్. అంటే బీజేపీకి ఈసారి మెజారిటీ బాగా తగ్గబోతోందని అర్థం చేసుకోవచ్చు. రాంమాధవ్ చెబుతున్నట్టు దక్షిణాదిన బీజేపీకి బాగా బలం తగ్గనుంది. కానీ బీజేపీతో స్వతహాగా కలిసి వచ్చే మిత్రపక్షాలు తక్కువే. దీనిని బట్టి చూస్తే కొత్త అనుబంధాల కోసం కమలం నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థం అవుతోంది.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా