newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

అయోమయంలో ప్రకాష్ రాజ్?

27-05-201927-05-2019 14:29:12 IST
Updated On 27-05-2019 17:39:18 ISTUpdated On 27-05-20192019-05-27T08:59:12.663Z27-05-2019 2019-05-27T08:59:10.389Z - 2019-05-27T12:09:18.165Z - 27-05-2019

అయోమయంలో ప్రకాష్ రాజ్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

న‌టుడు ప్రకాష్ రాజ్ మీద జ‌నానికి జాలేస్తోంద‌ట‌. రాజ‌కీయాల‌కు పూర్తిగా కొత్త అయిన ఆయ‌న‌, తాను ఎన్నిక‌ల్లో గెలిస్తే ఏం చేస్తాన‌న్నది జ‌నానికి స్పష్టంగా చెప్పలేదు. ప్రతిసారీ హిందూ వ్యతిరేక కామెంట్లు, జాతీయ వాదాన్ని వ్యతిరేకించ‌డం మిన‌హా ప్రకాష్ రాజ్ చేసింది ఏదీ లేదు. తానేదో సంఘ సంస్కర్తన‌న్న ఫీలింగులో ఆయ‌న ఉన్నాడ‌నేది చాలా మంది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. మొన్నటి కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌నీసం 40 సీట్లు కూడా రావంటూ ప‌లు జాతీయ మీడియా సంస్థల‌కు అడిగానా, అడ‌క్కపోయినా చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. బీజేపీకి క‌ర్ణాట‌క అసెంబ్లీలో 40 సీట్లు దాటితే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ సుబ్రమ‌ణ్యస్వామి ముందు స‌వాల్ విసిరారు. కానీ అప్పటి ఫ‌లితాల త‌ర్వాత నోరు మెద‌ప‌లేదు. అదేమ‌ని అడిగిన మీడియాతో, తాను ప్రజానాడికి స‌రిగ్గా అర్థం చేసుకోలేక పోయానంటూ మాట దాటేశారు. 

ఇక ఇప్పటి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరు సెంట్రల్ సీటు నుంచి పోటీ చేశారు ప్రకాష్ రాజ్. ప్రచారంలో భాగంగా తాను ఏం చేస్తాన‌న్నది జ‌నానికి క్లారిటీ ఇవ్వలేదు. ప్రతి స‌భ‌లో మోడీని తిట్టడం, బీజేపీ మీద ఆరోప‌ణ‌లు చేయ‌డం మిన‌హా ప్రక‌ష్ రాజ్ చేసింది ఏమీ లేద‌ట‌. కొన్ని స‌భ‌ల్లో ప్రకాష్ రాజ్ మీద జ‌నం నేరుగానే జోకులు వేశార‌ట‌. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పీ.సీ. మోహ‌న్, కాంగ్రెస్ అభ్యర్థిగా రిజ్వాన్ అర్షద్ బ‌రిలో దిగారు. 

ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. తాను గెలుస్తాన‌ని ప్రకాష్ రాజ్ భావించినా, ఆయ‌న‌కు డిపాజిట్లు కూడా ద‌క్కలేదు. 23,980 ఓట్ల మాత్రమే ఆయ‌న‌కు ద‌క్కాయి. ఈ ఫ‌లితంతో కంగుతిన్న ప్రకాష్ రాజ్, ప్రజా తీర్పు త‌న‌కు చెంప పెట్టువంటిద‌ని చెప్పుకొచ్చారు. తాను ఓడినా బీజేపీ మీద పోరాటం ఆప‌న‌నీ, సెక్యుల‌ర్ ఇండియా కోసం పోరాటం చేస్తాన‌ని చెప్పారు. 

ఇక్కడే ప్రకాష్ రాజ్ మైండ్ సెంట్ ఏంటో జనానికి అర్థం కావ‌డం లేద‌ట‌. 

జాతీయ వాదానికి జ‌నం ప‌ట్టం క‌ట్టినప్పుడు. ప్రజాతీర్పును గౌర‌విస్తాన‌ని ప్రకాష్ రాజ్ చెప్పారు. అలాంట‌ప్పుడు జాతీయ వాదాన్ని ఆయ‌న ఎందుకు త‌ప్పు ప‌డుతున్నారో జనానికి అర్థం కావ‌డం లేదట‌.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle