newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్

09-11-201909-11-2019 08:37:51 IST
Updated On 09-11-2019 08:38:51 ISTUpdated On 09-11-20192019-11-09T03:07:51.516Z09-11-2019 2019-11-09T03:07:28.361Z - 2019-11-09T03:08:51.145Z - 09-11-2019

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ కీలకమయిన అయోధ్య వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు రాబోతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 

సుప్రీం కోర్టు తీర్పు అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని అయోధ్యలోని రామ మందిర్ ఆలయ పూజారి మహంత్ సత్య దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు, 

అయోధ్య కేసులో తీర్పు వెలువడబోతున్న సందర్భంగా ముందు జాగ్రత్తలో భాగంగా స్కూల్స్, కాలేజీలకు రాజస్థాన్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నాలుగంచెల భద్రతలో అయోధ్య ఉంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ గెలుపుకాదు.. ఎవరికీ ఓటమికాదు.. దేశప్రజలంతా శాంతి, ఐకమత్యం, సద్భావనతో మెలగాలని మోడీ కోరారు. అయోధ్య తీర్పు వెలువరించే ఐదుగురు జడ్జీలకు భద్రత పెంచారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగోయ్‌కు జడ్‌ప్లస్ భద్రత వుంది. ఐదుగురు జడ్జీల ఇళ్ల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ భద్రత నడుమ నేడు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు న్యాయమూర్తులు. 

అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ అమలులో వుంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలవివాదానికి 134 సంవత్సరాల చరిత్ర వుంది.  2.77 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంలో సుదీర్ఘమయిన వాదనల అనంతరం ఇవాళ చారిత్రాత్మక తీర్పు వెలువడబోతోంది.

ఎన్నో ఏళ్ళ అయోధ్య  వివాదానికి రేపటితో చెక్ పెట్టబోతోంది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన విచారణను సుప్రీం కోర్టు, ఓ ప్రత్యేకమైన బెంచ్ ను ఏర్పాటు చేసి ఐదుగురు సభ్యుల ధర్మాసనం వాదనలు విన్న సంగతి తెలిసిందే.  అక్టోబర్ 16 వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది., ఈ తీర్పు కోసం యావత్ భారత ప్రజలు ఎదురుచూస్తున్నారు. తీర్పు ఎలా వున్నా ప్రజలు దానిని స్వాగతించాలని అంతా కోరుకుంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle