అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీం సీజె ప్రాణాలకు ముప్పు?
30-07-202030-07-2020 19:44:57 IST
Updated On 31-07-2020 08:32:35 ISTUpdated On 31-07-20202020-07-30T14:14:57.474Z30-07-2020 2020-07-30T14:13:00.565Z - 2020-07-31T03:02:35.914Z - 31-07-2020

భారతదేశంలో ప్రముఖమయిన తీర్పులు ఈ మధ్యకాలంలోనే వెలువడ్డాయి. అయోధ్య, ట్రిపుల్ తలాక్, కాశ్మీర్లో ఆర్టికల్ 370 వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఆగస్టు5వ తేదీన భూమి పూజ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య వివాదంలో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన వారిపై అగంతకులు దాడిచేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయన భద్రతను జెడ్ నుంచి జెడ్ ప్లస్‌కు మార్చింది. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో.. 64 ఏళ్ల సీజేఐ జస్టిస్ బోబ్డే ఒకరు.ఇప్పటివరకు భారత ప్రధాన న్యాయమూర్తికి జెడ్ కేటగిరీ భద్రత ఉండేది. దానిని జెడ్ ప్లస్ కేటగిరికి మార్చుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జస్టిస్ బోబ్డే సీఆర్పీఎఫ్, సీఏపీఎఫ్ బలగాలు భద్రతలో ఉండనున్నారు. భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే 2019 నవంబర్ 18న బాధ్యతలు చేపట్టారు.తన పదవీకాలంలో ఆయన ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. జస్టిస్ బోబ్డే 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకూ పదవిలో కొనసాగుతారు. బోబ్డే కంటే ముందు సీజేఐ పదవిలో ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ ఈయన పేరుని ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. కేంద్రం సూచన మేరకు బాబ్డే అపాయింట్మెంట్ వారెంట్ పై రాష్ట్రపతి సంతకం చేశారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
15 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
42 minutes ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
18 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
a day ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా