‘అయోధ్య’ అస్త్రం బీజేపీకి వరం కానుందా?
21-11-201921-11-2019 18:03:07 IST
2019-11-21T12:33:07.754Z21-11-2019 2019-11-21T12:33:06.109Z - - 10-04-2021

సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అయోధ్య అంశానికి శాశ్వత పరిష్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జార్ఖండ్ ఎన్నికల వేళ హోం మంత్రి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా అయోధ్య, కశ్మీర్ అంశాలను తెరపైకి తెచ్చారు. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యపై సుప్రీం కోర్టులో కేసు విచారణ జాప్యం కావడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని తీవ్రంగా మండిపడ్డారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించేందుకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని. ఇది అందరి విజయం అన్నారు. జార్ఖండ్లో ఈనెల 30 నుంచి డిసెంబర్ 20 వరకూ ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.జార్ఖండ్ లాతెహర్లో గురువారం అమిత్ షా ప్రసంగించారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పదే పదే ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ సర్కార్ వచ్చాకే గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయన్నారు అమిత్ షా.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా