newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అయోధ్యలో భారీ భద్రత.. భూమిపూజకు యోగి ఆతిథ్యం

29-07-202029-07-2020 19:22:45 IST
Updated On 30-07-2020 10:18:52 ISTUpdated On 30-07-20202020-07-29T13:52:45.950Z29-07-2020 2020-07-29T13:51:47.176Z - 2020-07-30T04:48:52.860Z - 30-07-2020

అయోధ్యలో భారీ భద్రత.. భూమిపూజకు యోగి ఆతిథ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయానికి చెందిన భూమిపూజ‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 5న జరుగబోయే భూమి పూజ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే సీఎం యోగి తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ ఈ కార్యక్రమానికి పిలువడం లేదని శ్రీ రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చాంపత్ రాయ్ తెలిపారు. 

కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత అందరినీ పిలుస్తామని చంపత్ రాయ్ చెప్పారు. భూమిపూజ‌కు రెండు రోజుల ముందు దేవాలయాల్లో రామాయణం, హనుమాన్ చలీసా పారాయణం, శ్లోకాలు, కీర్తనలు చేయాలని పూజారులు, సాధువులకు ట్రస్టు సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 5 సాయంత్రం ప్రజలు తమ ఇళ్ల వెలుపల దీపాలను వెలిగించాలని సూచించారు.

ఆగస్టు 5న ప్రధాని హెలికాప్టర్ అయోధ్యలోని సాకేత్ కాలేజీలో అడుగుపెట్టనుంది. రాత్రి 11:30 గంటలకు అయోధ్యలోని రామ్ ఆలయ ప్రాంగణాన్ని ప్రధాని సందర్శిస్తారు. భూమిపూజ కార్యక్రమం సుమారు గంట పాటు జరుగుతుంది. ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, ఉమా భార‌తి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు. క‌రోనా నేప‌థ్యంలో 200 మంది అతిథులతో మాత్ర‌మే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. భ‌క్తులంతా ఇళ్ల‌ల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించాల‌ని ఆల‌య ట్ర‌స్ట్ కోరింది.

అయోధ్య రామ‌జ‌న్మ భూమిలో రామ మందిరం భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని ‌భ‌గ్నం చేసి, విధ్వంసం చేసేందుకు ఉగ్ర‌వాదులు కుట్ర ప‌న్నుతున్నార‌న్న కేంద్ర నిఘావ‌ర్గాలు హెచ్చ‌రించ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆదేశాల‌తో లష్కరే, జైషే మహ్మద్‌ టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడతారని సమాచారం రావడంతో భద్రతా చర్యలు చేపట్టారు.

ఢిల్లీ, అయోధ్య, జమ్మూకాశ్మీర్‌‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి ఏడాది కావ‌డం, అయోధ్య‌లో రామ మందిరానికి శంకుస్థాప‌న చేయ‌డం ఒకే రోజు కావ‌డంతో దాడులు జ‌రిగే అవ‌కాశం ఉందని భద్రతదళాలు అప్రమత్తం అయ్యాయి, ప్ర‌ధాని హెలీకాప్ట‌ర్ దిగే సాకేత్ మ‌హా విద్యాల‌యం భూమిపూజ స్థ‌లం వ‌ర‌కు భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మోహ‌రించారు. రామ్‌కోట్‌ ప్రాంత నివాసితుల రాకపోకలకు ప్ర‌త్యేకంగా పాసులు జారీచేశారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle