newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అయోధ్యలో ఉగ్రవాదులు... హై అలర్ట్.. ప్రతి ఇల్లూ తనిఖీ

01-08-202001-08-2020 13:03:06 IST
Updated On 01-08-2020 13:36:48 ISTUpdated On 01-08-20202020-08-01T07:33:06.879Z01-08-2020 2020-08-01T07:33:02.594Z - 2020-08-01T08:06:48.859Z - 01-08-2020

అయోధ్యలో ఉగ్రవాదులు... హై అలర్ట్.. ప్రతి ఇల్లూ తనిఖీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రాచీన ఆధ్యాత్మక నగరంలో ఉగ్రవాద మూకలు పొంచి ఉన్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. 

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న భవ్య రామ మందిరం భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. 

భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని, తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చేరవేశాయి. 

కాగా అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన సాకేత్‌ మహావిద్యాలయ ప్రాంగణంలో హెలికాప్టర్‌లో దిగుతారు. ఇక్కడి నుంచి రామ జన్మభూమి వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేస్తున్నారు.

అయోధ్య పూజారికి, ఆలయ భద్రతా సిబ్బందికి కరోనా

ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న రామమందిర భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పూజారికి, పదహారు మంది భద్రతా సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకిన పూజారి ప్రదీప్‌ దాస్, ఆలయంలో పూజలు నిర్వహించే నలుగురు ప్రధాన పూజారుల్లో ఒకరైన ఆచార్య సత్యేంద్ర దాస్‌ శిష్యుడు. ప్రదీప్‌ దాస్‌ని ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉంచారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు.   

న్యూయార్క్‌లో భారీ స్క్రీన్‌లపై భూమిపూజ లైవ్..  

న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌ దగ్గర శ్రీరాముడి చిత్రాలూ, అయోధ్య  రామమందిరం త్రీడీ చిత్రాలను  ప్రపంచంలోనే అతిపెద్ద  17వేల చదరపుటడుగుల భారీ నాస్‌డాక్‌ స్క్రీన్‌పై దీన్ని ప్రదర్శించనున్నట్టు అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫెయిర్స్‌ కమిటీ అధ్యక్షుడు జగదీష్‌ షెహానీ వెల్లడించారు. ఇది జీవిత కాలంలో చూడలేని ఒక అద్భుతమైన కార్యక్రమం అని, ఈ చారిత్రక సందర్భంలో అమెరికాలోని భారతీయులంతా అక్కడ సమావేశమౌతారని షెహానీ అన్నారు.

ఆగ‌స్టు 3వ తేదీన గ‌ణేశుడి పూజ‌తో కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయ‌ని ట్ర‌స్ట్ స‌భ్యుడు డాక్ట‌ర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగ‌స్టు 5వ తేదీన గ‌ర్భ‌గుడిలో జ‌రిగే పూజ కోసం 11 మంది పండితులు వేద‌మంత్రాలు చ‌ద‌వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ చేత భూమిపూజ చేప‌ట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్‌ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle