అయోధ్యకు ఉద్ధవ్.. టూర్ వెనుక ప్లానేంటి?
15-06-201915-06-2019 09:05:00 IST
Updated On 22-06-2019 12:59:32 ISTUpdated On 22-06-20192019-06-15T03:35:00.821Z15-06-2019 2019-06-15T03:34:43.636Z - 2019-06-22T07:29:32.844Z - 22-06-2019

శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అయోధ్య అంశాన్ని ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అవకాశంగా తీసుకుంటున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు నవంబరులో పార్టీ నేతలతో అయోధ్య వెళ్లి రాంలాలాను దర్శించుకున్న ఉద్దవ్ థాక్రే, ఆదివారం మరోసారి అయోధ్య వెళ్తున్నారు. ఈ నెల 15వ తేదీన తాను అయోధ్య రాముడిని దర్శించుకోడానికి వస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయానికి సందేశం పంపారు ఉద్దవ్ థాక్రే. యూపీ సీఎం కార్యాలయం నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో ఆయన అయోధ్యకు వెళ్తున్నారు. తనతో పాటు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 18 మంది ఎంపీలను కూడా ఆయన తన వెంట తీసుకెళ్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు ముందు తాను అయోధ్య సందర్శిస్తానని గతంలోనే చెప్పిన థాక్రే, రామాలయ నిర్మాణం మీద తాము ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. చర్చల ద్వారా అయోధ్య అంశాన్ని పరిష్కరించుకోవాలన్న సుప్రీం కోర్టు సూచనను కూడా ఆయన స్వాగతించారు. ముస్లిం పెద్దలతో మాట్లాడి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నారు ఉద్దవ్ థాక్రే. రామాలయ నిర్మాణం మీద వెనక్కి తగ్గిందన్న అపవాదును బీజేపీ తొలగించుకోవాలనీ, కేంద్రంలో, యూపీలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకుని నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు ఉద్దవ్ థాక్రే. ఇక తన అయోధ్య యాత్రకు రాజకీయ రంగు వేయాల్సిన పని లేదని కూడా థాక్రే స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి రాంలాలా దీవెనలే కారణంగా చెబతున్నారు. మరోవైపు ఇప్పుటికే శివసేన ఎంపీలు అయోధ్య చేరుకున్నారట. తమ నేతలకు అన్ని యూపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించిందనీ చెబుతున్నారు యూపీ శివసేన అధ్యక్షుడు అనిల్ సింగ్. తన పర్యటనలో భాగంగా అయోధ్యలో సాధు సంతువులతో ఉద్దవ్ థాక్రే చర్చలు జరుపుతారనీ, రామాలయ నిర్మాణం మీద తీసుకోవాల్సిన తదుపరి చర్యల మీద సూచనలు తీసుకుంటారని అనీల్ సింగ్ చెబుతున్నారు. అటు ఉద్దవ్ థాక్రే పర్యటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ యూపీ విభాగం స్పష్టం చేస్తోంది. అయోధ్య రాంలాలాను ఎవరైనా దర్శించుకోవచ్చనీ, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెబుతోంది. మధ్యవర్తిత్వం ద్వారా అయోధ్య అంశాన్ని పరిష్కరించాలన్న ఉద్దవ్ థాక్రే సూచనను తాము పరిశీలిస్తామనీ, అయితే తమ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాజ్యాంగానికి లోబడే ఉంటుందనీ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు తేల్చిచెబుతున్నారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
4 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021
ఇంకా